టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వికెట్లను ఎంత ఈజీగా తీస్తాడో.. ఆఫ్ ది ఫీల్డ్‌లో కామెడీని కూడా అంతే ఈజీగా పండిస్తాడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే చాహల్.. సందు దొరికితే ఏదో ఒక రీల్ చేస్తూనే ఉంటాడు. అతని భార్య ధనశ్రీ వర్మతో కూడా కలిసి చాహల్ చాలా రీల్స్ చేశాడు. అలాగే టీమిండియా క్రికెటర్లతోనూ చాహల్ అనేక వీడియోలు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. మంచి ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లుతో చిన్నపాటి చిట్‌చాట్ ఇంటర్వ్యూలు సైతం చేస్తుంటారు. అదే క్రమంలో గురువారం శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన కుల్దీప్ యాదవ్‌తో చిన్న ఇంటర్వ్యూ చేశాడు చాహల్. ఈ చిట్‌చాట్‌లోనూ తనదైన స్టైల్లో మంచి కామెడీ పండించాడు.
కుల్దీప్ యాదవ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ప్లాన్స్‌పై ప్రశ్నలు సంధించాడు. అలాగే కుల్దీప్ యాదవ్‌కు 200 వికెట్లు పూర్తి చేస్తున్నందుకు కంగ్రాట్స్ చెప్పాడు. అయితే.. కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ ప్లాన్స్ గురించి వివరిస్తూ.. తాను చివరి సారిగా బంగ్లాదేశ్‌పై టెస్టు ఆడి.. వెంటనే వైట్ బాల్‌కు షిఫ్ట్ అయ్యానని.. ఈ మ్యాచ్‌కు ముందు మీరు(చాహల్) ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని కుల్దీప్ పేర్కొన్నాడు. దీంతో.. ‘ఇంతకు ముందు సూర్యకుమార్ యాదవ్‌కు నేను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాను.. ఇప్పుడు కుల్దీప్ బౌలింగ్ కోచ్ కూడా నేనే.. ఇది గుర్తుపెట్టుకోండి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.
అయితే.. శ్రీలంకతో తొలి వన్డేలో ఆడిన చాహల్.. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతని స్థానంలో కుల్దీప్ను ఆడించిన విషయం తెలిసిందే. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న కుల్దీప్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. తన 10 ఓవర్ల కోటా పూర్తి చేసిన కుల్దీప్ 51 రన్స్ మాత్రమే ఇచ్చి.. 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే.. కుల్దీప్ యాదవ్‌కు సరైన అవకాశాలు ఇవ్వడంలేదనే విమర్శలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించినా.. రెండో టెస్టుకు కుల్దీప్ను పక్కనపెట్టారు. మళ్లీ ఇప్పుడు తొలి వన్డేలో ఆడించలేదు. చాహల్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి కుల్దీప్ను రీప్లేస్ చేశారు కానీ.. కుల్దీప్ను ఒక రెగ్యులర్ ప్లేయర్‌గా గుర్తించడం లేదు. కానీ.. అవకాశం దొరికిన ప్రతిసారి కుల్దీప్ తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. మరి కుల్దీప్ ప్రదర్శన, చాహల్ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝙆𝙪𝙡𝘾𝙝𝙖 𝙞𝙨 𝘽𝙖𝙘𝙠! 🤗
Presenting special edition of Chahal TV 📺 from Kolkata
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: @yuzi_chahal interviews Milestone Man @imkuldeep18 post #TeamIndia’s victory in the 2⃣nd #INDvSL ODI 👌🏻👌🏻 – By @ameyatilak
Full interview 🔽https://t.co/K1dRVC6BCH pic.twitter.com/Ixk7rLCB1P
— BCCI (@BCCI) January 13, 2023