సౌతాఫ్రికాతో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన చివరి టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో ఓడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ సిరీస్ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.. మూడోదైన చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. ముఖ్యంగా రిలీ రోసోవ్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేని రోసోవ్ ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదడం విశేషం. తను ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండో మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ భారత్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయగా.. ఇప్పుడు రోసోవ్ రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.
కాగా ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో రోసోవ్ క్రీజ్‌లోకి మరీ లోపలకి నిలబడి బ్యాటింగ్ చేసే క్రమంలో తన కాలితో వికెట్లను పడగొట్టాడు. కానీ.. అతన్ని హిట్ వికెట్ కింద అంపైర్ అవుట్ ఇవ్వలేదు. సిరాజ్ అంతకు ముందు బంతిని నోబాల్ వేయడంతో.. ఫ్రీహిట్ కోసం సిద్ధంగా ఉన్న రోసోవ్.. సిరాజ్ యార్కర్ సంధిస్తాడని ముందే ఊహించి.. భారీ షాట్ ఆడాలని క్రీజ్ లోపలికి వెళ్లి నిల్చున్నాడు. సిరాజ్ రన్నప్‌లో ఉండగా.. రోసోవ్ మరింత వెనక్కి వెళ్లడంతో అతని కాలు వికెట్లను తాకింది. దీంతో అంతా రోసోవ్ హిట్ వికెట్‌గా అవుట్ అనుకున్నారు. కానీ.. అప్పటికింకా బౌలర్ చేతల్లోంచి బాల్ రిలీజ్ కాకపోవడంతో రోసోవ్ బతికిపోయాడు. తన బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకుముందే రోసోవ్ వికెట్లను తాకడాన్ని గమనించిన సిరాజ్ బాల్ వేయకుండా.. అసహనంతో బంతిని కీపర్‌కు విసిరాడు. ఈ ఘటనతో స్టేడియంలో నవ్వులు పూశాయి. సాధారణంగా బ్యాటర్ బ్యాటింగ్ చేస్తూ.. వికెట్లను తాకితే అతన్ని హిట్ వికెట్ కింద అవుట్‌గా ప్రకటిస్తాడు. ఇది క్రికెట్‌లో అరుదుగా జరిగే అవుట్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిలీ రోసోవ్(100 నాటౌట్) సెంచరీకి తోడు క్వింటన్ డికాక్(68) హాఫ్ సెంచరీతో రాణించడం, చివరి ఓవర్‌లో మిల్లర్ మూడు సిక్సులతో విరుచుపడ్డంతో ప్రొటీస్ జట్టు భారీ టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచింది. బ్యాటింగ్ పిచ్‌పై టీమిండియా ఈ స్కోర్‌ను ఛేదిస్తుందని అంతా అనుకున్నా.. అలా జరగలేదు. భారత బౌలర్లు ఒకరి వెంట ఒకరూ పెవిలియన్‌కు క్యూకట్టారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చిన దినేష్ కార్తీక్(46), ఓపెనర్‌గా వచ్చిన పంత్(27), దీపక్ చాహర్(31) పర్వాలేదని పించారు. మిగతా వాళ్లు విఫలం అవ్వడంతో భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయి.. 49 పరుగుల తేడాతో ఓడింది. కానీ.. తొలి రెండు మ్యాచ్‌లో గెలవడంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
Rilee Rossouw got Hit Wicket on a free hit 😂😂😂 @Rileerr #indvssa #Cricket #t20 pic.twitter.com/gWE87leXUm
— Cricstagram (@Cricstagram) October 4, 2022