క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు జట్టులో ఉంటే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సమతూల్యత ఉంటుంది. ముఖ్యంగా టెస్టుల్లో వీరి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆల్ రౌండర్ ని తయారు చేసుకోవడంలో టీమిండియా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది
భారత క్రికెట్లో బ్యాటర్లకి, స్పిన్నర్లకు కొదువ లేదు. తరాలు మారినా మన దేశంలో ఇండియన్ క్రికెట్ టీంలోకి వీరు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా టీంఇండియాలో ఫాస్ట్ బౌలర్ల కొరత ఉండేది. ఇదిలా ఉండగా.. షమీ, సిరాజ్, బుమ్రా, ఉమేష్ యాదవ్ లాంటి పేసర్లతో ప్రస్తుతం టీమిండియా పటిష్టంగా తయారైంది. ఇంకా చెప్పాలంటే టీమిండియా విదేశాల్లో విజయాలు సాధిస్తుందంటే దానికి ప్రధాన మన ఫాస్ట్ బౌలర్లే. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి చేరి రాణించడం టీమిండియాకు చాలా సమస్యలు తీరిపోయాయని అందరూ భావించారు. కానీ 140 కోట్లకు పైగా ఉన్న భారత్ జనాభాలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ని సంపాదించడంలో మాత్రం ఇంకా విఫలమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా టెస్టుల్లో ఇలాంటి బౌలర్ లేకపోవడం చాలా దురదృష్టకరం.
క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు జట్టులో ఉంటే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సమతూల్యత ఉంటుంది. ముఖ్యంగా టెస్టుల్లో వీరి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆల్ రౌండర్ ని తయారు చేసుకోవడంలో టీమిండియా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కో తరానికి పదుల సంఖ్యలో బ్యాటర్లు, స్పిన్నర్ల, వస్తుంటే ప్రతి దశాబ్దానికి మాత్రం ఒక్కడే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ టీమిండియాకు దొరుకుతున్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ అల్ రౌండర్ల విషయానికి వస్తే కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్య పేర్లు మాత్రమే గుర్తుకొస్తాయి. వీరి మీద అతిగా ఆధారపడడం వలనే టెస్టుల్లో భారత్ ఎప్పటికప్పుడు వెనకపడుతూనే ఉంటుంది.
“హార్దిక్ పాండ్య” భారత్ లో చెప్పుకోదగా ఒకే ఒక్క ఫాస్ట్ బౌలింగ్ఆల్ రౌండర్. హార్దిక్ సేవలు పరిమిత వర్ల క్రికెట్ లో వాడుకుంటున్నా.. టెస్టు క్రికెట్ లో మాత్రం ఈ ఆల్ రౌండర్ ని ఆడించడంలో నిర్లక్ష్యం చేస్తుంది. దానికి తగ్గట్లే పాండ్య కూడా టెస్టు క్రికెట్ మీద ఆసక్తి చూపించడం లేదు. ఈ సమస్య స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచులకి అవసరం లేకపోయినా.. విదేశాల్లో మాత్రం అత్యవసరం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న భారత్ కి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేని కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఈ ఫైనల్లో హార్దిక్ ఉన్నట్లయితే లెక్క వేరుగా ఉండేది. హార్దిక్ ఒక నిఖార్సైన అల్ రౌండర్. బ్యాటింగ్ లో నిలకడగా రాణించదాంతో పాటు.. బౌలింగ్ లో 130 కిలోమీటర్ల వేగంతో బంతులని సంధించగలడు.
వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లిన టీమిండియా గతేడాది న్యూజీలాండ్ చేతిలో ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై ఇద్దరు స్పిన్నర్లు అవసరం లేకపోయినా తుది జట్టులో బలవంతంగా ఇరికించి తగిన మూల్యం చెల్లించుకుంది. ఇక ఈ సారి కూడా శార్దూల ఠాకూర్ ఆ కొరత కొంత తెరిచిన హార్దిక్ జట్టులో ఉంటే ఆ భరోసా వేరుగా ఉండేది. కానీ ఈ హార్దిక్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్ ని టీమిండియా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్ధం కావడం లేదు. బెన్ స్టోక్స్, గ్రీన్ లాంటి ప్లేయర్లు టెస్టు క్రికెట్ కి ప్రాధాన్యం ఇస్తుంటే పాండ్య మాత్రం ఐపీఎల్ లాంటి లీగ్ ల మీద ఆసక్తి చూపించడం టీమిండియా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. ఈ సమస్య ఇలాగే కొనసాగితే.. విదేశాల్లో మరిన్ని ఓటములు మూటకట్టుకోవడం ఖాయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.