దేశం ఉలిక్కిపడేలా చేసిన పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి 4 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ ఘటనలో అమరులైన 40 మంది జవాన్ల కోసం దేశం మొత్తం కంటతడి పెట్టింది. అయితే.. కొంతమంది మాత్రం అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచింది. అలా అండగా నిలిచిన వారిలో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా ఉన్నారు.
2019 ఫిబ్రవరి 14.. ఇండియా మొత్తం ఉలిక్కిపడిన రోజు. జమ్ము శ్రీనగర్‌లోని పుల్వామా ఉగ్రదాడి జరిగి..40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అ ఘటనతో దేశంలో మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సైనికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు చూసి.. కంటతడి పెట్టని వ్యక్తి లేడు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం సైనికుల కోసం నిలబడింది. అలాగే ప్రముఖ వ్యక్తులు సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. కొన్ని గొప్ప ప్రకటనలు చేశారు. అలాంటి వాటిలో ఒకటి.. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసింది. దాడి తర్వాత కొన్ని రోజులకు పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్ల పిల్లలను ఉచితంగా చదివిస్తానని, వారి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించాడు.
ఇచ్చిన మాట ప్రకారం సెహ్వాగ్ ఇద్దరు జవాన్ల పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నాడు. హర్యానాలోని తన స్కూల్‌లో ఆ పిల్లలకు చదువుతో పాటు క్రికెట్‌లోనూ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన షహీద్ రామ్ వకీల్ కుమారుడు అర్పిత్ సింగ్, షహీద్ విజయ్ సోరెంగ్ రాహుల్ సోరెంగ్‌లు ప్రస్తుతం హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే చదువుతున్నారు. అయితే.. పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఇంకో నలభై ఏళ్లు గడిచినా.. అమరులైన సైనిక కుటుంబాల విషాదం తీరేది కాదు. కానీ.. వారి కుటుంబాలకు కోసం అండగా నిలబడిని వారిని అభినందించాల్సిందే. అలా అభినందనలు పొందాల్సిన వ్యక్తుల్లో సెహ్వాగ్ ఒకడు. ఇది సేవగా కాకుండా తనవంతు బాధ్యతగా సెహ్వాగ్ అమర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే.
సెహ్వాగ్‌తో పాటు మరో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సైతం పుల్వామా దాడిలో చనిపోయిన సైనికుల పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటానని ప్రకటించాడు. ఇలా మరికొంతమంది కూడా పుల్వామా బాధిత సైనిక కుటుంబాలకు అండగా నిలబడ్డారు. అయితే.. ఈ దాడితో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రస్తావరాలపై విరుచుకుపడింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిపి.. ఉగ్రస్థావరాలను మట్టుపెట్టింది. ఈ మెరుపు దాడి తర్వాత పుల్వామా అమరులకు నివాళి దక్కిందంటూ దేశం మొత్తం హర్షించింది. మరి పుల్వామా అటాక్‌తో పాటు జవాన్ల పిల్లలకు సెహ్వాగ్ అండగా నిలబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Today marks one year since the terrible Pulwama attack on our brave jawans. Naman to all of them.
In this pic are Batsman -Arpit Singh s/o Pulwama Shaheed Ram Vakeel &
Bowler-Rahul Soreng s/o Pulwama Shaheed Vijay Soreng.
Very privileged to have them study in my @SehwagSchool pic.twitter.com/9ZewyoYFo3— Virender Sehwag (@virendersehwag) February 14, 2020