తన సక్సెస్ కంటే తన తోటి ఆటగాళ్ల సక్సెస్‌ను ఎంజాయ్ చేయడంలో ముందుండే ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. జట్టులో ఆటగాడు ఎవరైనా మంచి ప్రదర్శన కనబరిస్తే.. వారి కంటే ఎక్కువ సంబురాలు చేసుకుని వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండోర్ వేదికగా నేడు(బుధవారం) ప్రారంభమైన మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కుహ్నేమాన్, టాడ్ మర్ఫీ, నాథన్ లయన్ చెలరేగడంతో భారత్ 109 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ 22 పరుగులతో భారత బ్యాటింగ్ లైనప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ(12), శుబ్‌మన్ గిల్(21), పుజారా(1), జడేజా(4), శ్రేయస్ అయ్యర్(0), కేఎస్ భరత్(17) దారుణంగా నిరాశపరిచాడు. వారి వెంటే.. అశ్విన్(3), ఉమేష్ యాదవ్(17), సిరాజ్(0) అవుట్ అయ్యారు. అక్షర్ పటేల్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్‌లో భారత్ పేసర్ ఉమేష్ యాదవ్ చివర్లో తన పవర్ హిట్టింగ్‌తో అలరించాడు. నాథన్ లయన్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్ చివరి బంతిని మిడ్ వికెట్ పై నుంచి స్లాగ్ స్విప్ ఆడాడు. ఉమేష్ ఆ బాల్‌ను అద్భుతంగా టైమ్ చేయడంతో బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఆ వెంటనే టాడ్ మర్ఫీ వేసిన ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో మరో భారీ సిక్స్ బాదాడు. ఉమేష్ కొట్టిన సిక్సర్లు చూసి.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి వాతావారణం నెలకొంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే.. చిన్న పిల్లాడిలా సంతోష పడ్డాడు. ప్రస్తుతం కోహ్లీ సంబురాల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ రియాక్షన్ ఇలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఉమేష్ సిక్సులకు షాకింగ్ ఫేస్ పెట్టి.. చప్పట్లు కొడుతూ అభినందించాడు. మరి ఉమేష్ సిక్సులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli when Umesh Yadav his six 😂❤️ pic.twitter.com/bZGzV6i7l4
— S. (@Sobuujj) March 1, 2023
Kohli’s reaction on Umesh Yadav’s six. 😂😂🔥 pic.twitter.com/XSJQSM9LEG
— Mahirat (@bleedmahirat7) March 1, 2023