బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ తరపున పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ పై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ఆ విషయంలో సచిన్ ఎక్కువ టైమ్ తీసుకున్నాడని, నేను మాత్రం 22 ఏళ్లకే సాధించాను అని చెప్పుకొచ్చాడు.
ప్రపంచ క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించడమనేది ప్రతీ ఒక్క క్రీడాకారుడి జీవిత స్వప్నంగా భావిస్తారు. మరి ఇలాంటి కల తన తొలి టోర్నమెంట్ తోనే సాధ్యం అయితే.. ఆ క్రీడాకారుడి ఆనందానికి హద్దులే ఉండవు. తాజాగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ తరపున పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా దిగ్గజాలు సాధించలేని ఘనతను తాను అతి పిన్న వయసులోనే సాధించడం సంతోషంగా ఉందని విరాట్ కోహ్లీ అన్నాడు. ఇక సచిన్ ఆ ఘనత కోసం అంత టైమ్ తీసుకుంటే.. నేను మాత్రం కెరీర్ తొలినాళ్లలో అంటే 22 సంవత్సరాలకే సాధించాను అని విరాట్ చెప్పుకొచ్చాడు.
సచిన్ టెండుల్కర్.. ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో పరిపాలించిన రారాజు. టన్నుల కొద్ది పరుగులు, వద్దల కొద్ది అవార్డులు, లెక్కలేనన్ని రికార్డులు.. సచిన్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేవి. ఇంతటి ఘనతను సొంతం చేసుకున్న సచిన్.. వన్డే వరల్డ్ కప్ ను సాధించడానికి మాత్రం ఆరు వరల్డ్ కప్ లు పట్టింది. 28 సంవత్సరాల తర్వాత 2011 ప్రపంచ కప్ ను గెలిచిన జట్టులో సచిన్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సచిన్ వరల్డ్ కప్ గెలవడానికి ఆరు సంవత్సరాలు పడితే నాకు మాత్రం ఎక్కువ రోజులు పట్టలేదని అన్నాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో భాగంగా.. జీవితంలో మర్చిపోలేని సంఘటనను గుర్తు చేసుకున్నాడు విరాట్. ఈ కార్యక్రమంలో..”సచిన్ కు 2011 వరల్డ్ కప్ చివరిదని, దానిని సచిన్ కు అందించాలని ధోని మాకు చెప్పాడు. దాంతో అందరం కసిగా ఆడి ఆ వరల్డ్ కప్ సచిన్ కు అందించాం. అయితే ఈ వరల్డ్ కప్ గెలవడానికి సచిన్ 6 వరల్డ్ కప్ లు ఆడాల్సి వచ్చిందని. కానీ నా అదృష్టం కొద్ది.. నేను తొలి టోర్నీలోనే ఈ ఘనత సాధించాను” అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక నన్ను వరల్డ్ కప్ కు సెలక్ట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదని, అయితే అప్పుడు నేను చేసిన పరుగులే దానికి కారణం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ నేపథ్యంలో 2011 వరల్డ్ కప్ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీ.. సారథిగా మాత్రం ఒక్క ఐసీసీ టోర్నీని కూడా గెలవలేకపోవడం గమనార్హం. ఇక సచిన్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో భారత్ కు ఎన్నో విజయాలను అందిచాడు. దాంతో పాటుగా క్రికెట్ గాడ్ గా అభిమానులతో పిలిపించుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ సైతం తన రోల్ మోడల్ సచిన్ అని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. మరి సచిన్ కంటే తక్కువ సమయం, వయసులో విరాట్ ఈ ఘనత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.