టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, కింగ్ కోహ్లీ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. 2023 ఏడాది మొదలైనప్పటి నుంచి కోహ్లీ 2016లో కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. సిరీస్ లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో సెంచరీ బాదిన కోహ్లీ.. ఆదివారం జరిగిన మూడో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 సిక్సులతో 166 పరుగులతో దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన కెరీర్‌లో రెండో అత్యధిక స్కోర్ సాధించడమే కాకుండా.. పలు అరుదైన రికార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. భారత్‌లో అత్యధిక సెంచరీలు వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 20 సెంచరీలతో టాప్‌లో ఉన్న దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
అలాగే ఈ మూడు వన్డేలు సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్ తర్వాత.. టీమిండియా యువ ఓపెనర్, ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ కోహ్లీతో చిన్న చిట్‌చాట్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన కోహ్లీ.. ఇలాంటి ఇన్నింగ్స్‌తో తన కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుందని.. తాను పూర్తి స్థాయిలో టచ్‌లోకి వస్తే.. అది చాలా కాలం ఉంటుందని.. వన్డే వరల్డ్ కప్‌కు ముందు తన నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు రావడం ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే.. సెంచరీ చేసిన గిల్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
అలాగే తన సక్సెస్‌కు కారణమైన వ్యక్తులు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉన్నారని.. వారిలో ఈ ముగ్గురు ఎంతో ముఖ్యమైన వారని కోహ్లీ వెల్లడించాడు. వారిని కెమెరా ముందు తీసుకొచ్చి.. ప్రపంచానికి పరిచయం చేశాడు. రఘు, దయా, నువాన్ ఈ ముగ్గురిని, వారి పేర్లను గుర్తుంచుకోవాలి కోరాడు. నెట్స్‌లో ఎంతో అవిశ్రాంతగా వారు శ్రమించడంతోనే తాను సక్సెస్ అవుతున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. నెట్స్‌లో గంటకు 145, 150 వేగంతో బంతులు వేస్తూ.. మేము ఎప్పటి కప్పుడు మెరుగైయ్యేలా చేస్తుంటారని అన్నాడు. గిల్ సైతం వారి గురించి మాట్లాడుతూ.. వీరి ముగ్గురి పేరిట దాదాపు 1200, 1500 వికెట్లు ఉంటాయని నెట్స్‌లో తీసిన వికెట్ల గురించి సరదాగా ప్రస్తావించాడు. ఆ ముగ్గురిలో ఒకతను శ్రీలంకకు చెందిన వ్యక్తి కూడా ఉండటం విశేషం. మరి సపోర్టింగ్ స్టాఫ్‌కు కోహ్లీ ఇచ్చిన ప్రాధాన్యతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
.@imVkohli & @ShubmanGill reflect on the efforts put behind the scenes, courtesy this trio of throwdown specialists 👏 👏
You wouldn’t want to miss this sneak peek into #TeamIndia‘s backstage heroes 👍 👍 – By @ameyatilak
Special Feature 🎥 🔽 #INDvSLhttps://t.co/SFYQKgKkW2 pic.twitter.com/zY0g2pjJHI
— BCCI (@BCCI) January 16, 2023