టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం శ్రీలంకతో ప్రారంభం కానున్న తొలి టెస్టు విరాట్‌లో వందో టెస్టు కానుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు విరాట్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా విరాట్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన 100వ టెస్టు ఆడుతుండడంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నిజంగా తాను 100వ టెస్టు మ్యాచ్ ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని, ఇది తన జీవితంలో సాధ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇలా తన 100వ టెస్టు గురించి చెప్తు కోహ్లీ కాస్తా ఎమోషనల్ అయినట్లు కనిపించాడు.
కాగా తనతో పాటు తన కుటుంబం, చిన్ననాటి కోచ్ కూడా చాలా ఆనందపడతారని పేర్కొన్నాడు. చాలా సుదీర్ఘ క్రికెట్ ఆడానని అన్నాడు. ఇంతకాలం క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గా ఉండేందకు చాలా కష్టపడినట్లు వెల్లడించాడు. తక్కువ పరుగులు చేయాలని తానెప్పుడూ ఆలోచించలేదని.. ఎప్పుడు కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడేందుకే ప్రయత్నిస్తానని అన్నాడు. జూనియర్ క్రికెట్ లెవెల్ నుంచే తాను డబుల్ సెంచరీలు చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు చాలా ఇష్టపడతానని కోహ్లీ చెప్పాడు. అలాగే టెస్టు క్రికెట్టే అసలైన క్రికెట్ అని.. ఇది కొనసాగాలని, భవిష్యత్తు తరాలు టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించాలని కోహ్లీ పేర్కొన్నాడు. మరి కోహ్లీ 100వ టెస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘I never thought i’ll play 100 Test matches. It has been a long journey. Grateful that i’ve been able to make it to 100’ – @imVkohli on his landmark Test.
Full interview coming up on https://t.co/Z3MPyesSeZ. Stay tuned! #VK100 pic.twitter.com/SFehIolPwb
— BCCI (@BCCI) March 3, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.