విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత హుషారుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు తనలో డ్యాన్సర్ ను అభిమానులకు పరిచయం చేస్తూ.. మైదానంలో స్టెప్పులు వేస్తుంటాడు. తాజాగా మరోసారి ఓ స్టార్ డ్యాన్సర్ల గ్రూప్ తో కలిసి ప్రపంచ ప్రాచూర్యం పొందిన 'క్విక్ స్టైల్లో' డ్యాన్స్ ఇరగదీశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చాడు. కొన్ని రోజుల కిందటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో 186 పరుగులతో భారీ సెంచరీని నమోదు చేశాడు. దాంతో ఈ మ్యాచ్ ను టీమిండియా డ్రాగా ముగించుకుని సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత హుషారుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు తనలో డ్యాన్సర్ ను అభిమానులకు పరిచయం చేస్తూ.. మైదానంలో స్టెప్పులు వేస్తుంటాడు. తాజాగా మరోసారి ఓ స్టార్ డ్యాన్సర్ల గ్రూప్ తో కలిసి ప్రపంచ ప్రాచూర్యం పొందిన ‘క్విక్ స్టైల్లో’ డ్యాన్స్ ఇరగదీశాడు. ఇక ఈ డ్యాన్స్ కు అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజుగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక గ్రౌండ్ లో ఎంత కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో.. అంతే జోవియల్ గా ఉంటాడు. అదీకాక అప్పుడప్పుడు తనలో ఉన్న డ్యాన్సర్ ను అభిమానులకు పరిచయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గతంలో మనం చాలాసార్లు కోహ్లీ డ్యాన్స్ లను చూసే ఉన్నాం. ఇక గ్రౌండ్ లోనే కాకుండా కొన్ని కొన్ని సందర్బాల్లో బయటి కార్యక్రమాల్లో కూడా అప్పుడప్పుడు కాలు కదుపుతుంటాడు విరాట్ భాయ్. తాజాగా మరోసారి తన డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీశాడు విరాట్. వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన నార్వే క్విక్ స్టైల్ డ్యాన్స్ గ్రూప్ తో కలిసి చిందేశాడు కోహ్లీ.
ముంబైలో కొన్ని షోలు చేయడానికి ఈ గ్రూప్ ఇండియా వచ్చింది. ఈ క్రమంలోనే ఆ గ్రూప్ ను కలిసిన విరాట్.. వారితో చిందేశాడు. బ్యాట్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా కోహ్లీ చిందేశాడు. ఈ వీడియోను క్విక్ స్టైల్ టీమ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోహ్లీ సైతం నేను ఎవరిని కలిశానో చెప్పుకోండి చూద్దాం అని క్విక్ స్టైల్ గ్రూప్ తో దిగిన ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ కు విరాట్ సతీమణి అనుష్క ఓ ఎమోజీతో రియాక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బ్యాట్ తో సెంచరీలు కొట్టడమే కాకుండా బ్యాట్ పట్టుకుని డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.