అది బ్యాటింగ్ కాదు.. ఒక విధంగా చెప్పాలంటే శివతాండవం. బంతిని గ్రౌండ్‌లో ఏ వైపుకైనా ఏధంగానైనా కొట్టగల సామర్థ్యం ఉన్న మిస్టర్ 360 మరోసారి తన బిరుదును సార్థకం చేసుకున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. క్రీజ్‌లోకి సూర్య రాకముందు ఎడ్లబండిలా సాగిన టీమిండియా ఇన్నింగ్స్.. సూర్యబాదుడికి రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చినా.. సూర్య సునామీ ఇన్నింగ్స్ ముందు అది కూడా చిన్నబోయింది. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సుర్లు బాది 68 పరుగులు చేశాడు సూర్య. ఈ శివతాండవాన్ని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి కళ్లారా చూసిన కోహ్లీ.. సూర్యను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. బౌ డౌన్‌తో సూర్యకుమార్ యాదవ్‌ను గౌరవించాడు.
ప్రపంచ క్రికెట్‌లో కింగ్ లాంటి కోహ్లీ నుంచి ఇలాంటి ఊహించని రెస్పెక్ట్ పొందడంతో సూర్య సైతం ఉబ్బితబ్బియ్యాడు. ప్రస్తుతం కోహ్లీ.. సూర్యకు బౌ డౌన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ లాంటి లెజెండ్ సూర్య ఇన్నింగ్స్‌కు ఫిదా అవ్వడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌కు దినేష్ కార్తీక్ బౌ డౌన్ చేశాడు. ఇప్పుడు సూర్యకు కోహ్లీ బౌ డౌన్‌తో గౌరవించడంతో టీమిండియాలో మంచి స్నేహ వాతావరణం ఉందని, ఆటగాళ్లు ఒకరి సక్సెస్‌ను మరోకరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుందని, ఇది జట్టుకు ఎంతో మంచి చేస్తుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి 10 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేసిన భారత్.. సూర్య చెలరేగడంతో చివరి 5 ఓవర్లో భారీ స్కోర్ రాబట్టింది. ఇక హాంకాంగ్ బౌలర్లు 15 ఓవర్లల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఆకట్టుకున్నారు. ఆయూష్ శుక్లా, మొహమ్మద్ ఘజాన్‌ఫర్ ఒక్కొ వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్, ఆవేశ్ ఖాన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో టీమిండియా ఆసియా కప్‌లో సూపర్ ఫోర్‌కే చేరింది. ఇక గ్రూప్ ఏ లో పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ ఫోర్‌కు చేరుతుంది. మరి ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఇన్నింగ్స్‌పై, కోహ్లీ గౌరవించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘ఐ లవ్ ఇండియా’ అంటూ పాకిస్థాన్ క్రికెటర్ సంచలన స్టేట్‌మెంట్!
Respect from Virat Kohli! 🤩🇮🇳#India #TeamIndia #SuryakumarYadav #CricketTwitter
— Sportskeeda (@Sportskeeda) August 31, 2022
The reaction of Virat says it all – Surya Kumar Yadav madness in Dubai 😎 pic.twitter.com/TOYBC5xxlz
— Utsav 💙 (@utsav045) August 31, 2022
Watch the monstrous and ultimate class of sky yadav…#SuryakumarYadav pic.twitter.com/oVud6eupN0
— Deepak sharma (@DeepakS18805356) August 31, 2022
It was heartwarming gesture by Kohli: Suryakumar Yadav on former Indian captain’s reaction to his blistering knock
Read @ANI Story | https://t.co/ifDMmbeDNc#SuryakumarYadav #ViratKohli #AsiaCup2022 pic.twitter.com/vbZN85OlFN
— ANI Digital (@ani_digital) August 31, 2022