రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వద్ద రికార్డుల మూట చాలా పెద్దదే ఉంది. ఈ మూటలో మరో భారీ రికార్డును వేసుకునేందుకు కేవలం 7 అడుగుల దూరంలో ఉన్నాడు విరాట్. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య నేటి(సోమవారం) నుంచి రెండో మ్యాచ్ జరగనుంది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి జోహన్నెస్‌బర్గ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా గట్టి ప్లానింగ్‌తో ఉంది.
అలాగే గత కొంత కాలంగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్ కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగుతుందని అంతా భావిస్తున్నారు. వాండరర్స్ స్టేడియంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండు టెస్టుల్లో కెప్టెన్ కోహ్లీ 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. విరాట్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 50+ పరుగులు చేయడం విశేషం. జోహన్నెస్‌బర్గ్‌లో కోహ్లికి ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, జోహన్నెస్‌బర్గ్‌లో రెండవ అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
కోహ్లీకి ముందు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు జాన్ రీడ్ పేరు వచ్చింది. అతను వాండరర్స్‌లో ఆడిన 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో 316 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కేవలం 7 పరుగులు చేస్తే.. ఈ మైదానంలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. మరి విరాట్ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్‌కు మాత్రమే సాధ్యమైంది