భారత్-ఇంగ్లండ్ మధ్య ఇటివల జరిగిన రీషెడ్యూల్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. కాగా మ్యాచ్ తర్వాత ఇంగ్లీష్ మీడియా విరాట్ కోహ్లీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో పరుగులు చేయని కోహ్లీ ఇంగ్లండ్ వికెట్లు పడుతున్న సమయంలో మాత్రం బాగా అతి చేశాడని, బెయిర్‌స్టోతో కావాలని గొడవ పడినట్లు కోహ్లీని విమర్శించింది ఇంగ్లీష్ మీడియా.
తాజాగా ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ సందర్భంగా నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన అలెక్స్ లీచ్ వికెట్ పడిన సమయంలో విరాట్ కోహ్లీ పిచ్ మధ్యలోకి వెళ్లి మరీ సంబురాలు చేసుకున్నాడంటూ ఒక పత్రికలో ఫొటోతో సహా ప్రచురించారు. అది బంతి పడే చోటు అక్కడికే వెళ్లి అత్యుత్సాహం చూపాడంటూ మీడియా పేర్కొంది. ఈ విషయంలో కూడా కోహ్లీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ విషయంపై స్పందించిన వెస్టిండీస్ క్రికెటర్ టీనో బెస్ట్ విరాట్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియాను ఏకిపారేశాడు. ‘బోల్డ్, బ్రౌన్, నలుపు రంగే మీ అసలు సమస్య. మిమ్మల్ని సవాలు చేసే మీకు అది నచ్చదు. ఇంగ్లీస్ పేపర్లు చదివి విసిగిపోయాను. విరాట్ కోహ్లీ లేదా ఆంగ్లేయుల కానీ వారి గురింది రాస్తూనే ఉండడండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘విరాట్ కోహ్లీ ఆధునికి ఐకాన్.. కేవలం అతను ఇంగ్లీష్ వాడు కాదు కాబట్టే.. ఇలా ఇంగ్లీష్ వ్యాఖ్యాతలు విషం కక్కుతున్నారు’ అంటూ పేర్కొన్నాడు. టీనో బెస్ట్ వ్యాఖ్యలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విరాట్ కోహ్లీ బెయిర్‌స్టో విషయంలో అతిగా ప్రవర్తించాడని మీడియా పేర్కొంటుంటే.. బెస్ట్ ఇక్కడ జాత్యాహంకారం చొప్పిస్తున్నాడంటూ కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An interesting place to celebrate the wicket of Alex Lees… Pic credit: @dudleyplatypus pic.twitter.com/KvmgjVtsDY
— George Dobell (@GeorgeDobell1) July 6, 2022