భారతదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన ఆట ఏది అంటే.. క్రికెట్ అనే సమాధానం వస్తుంది. అయితే క్రికెట్ లో పురుషులు, మహిళల జట్లు ఉన్నప్పటికీ.. మెన్స్ క్రికెట్ కు ఉన్న ఆదరణ గానీ.. స్పాన్సర్ షిప్ లు గానీ వుమెన్స్ క్రికెట్ కు లేవనే చెప్పాలి. స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలి అనే గొప్ప గొప్ప మాటలు పుస్తకాల్లోనో లేదా సినిమాల్లోనో కనిపిస్తాయి. సమాజంలో ఎంత వెతికినా గానీ అక్కడక్కడ మాత్రమే చాలా అరుదుగా స్త్రీ-పురుషుల సమానత్వం కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? అక్కడే వస్తున్నా.. మరికొన్నిరోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నీకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్. అయితే ఈ ప్రోమోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ట్రోల్ చేశారంటూ.. అభిమానులు వాపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ప్రపంచ కప్ లాంటి మెగాటోర్నీల ప్రారంభానికి ముందు.. ఆ టోర్నీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం ఆనవాయితిగా వస్తూనే ఉంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 10 నుంచి సౌతాఫ్రికా వేదికగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టోర్నీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో రోహిత్ శర్మను తక్కువ చేసి చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే? ఓ మహిళా క్రికెట్ అభిమాని టీమిండియా జెర్సీలు అమ్మే షాప్ కు వెళ్తుంది. ఆమె ‘శర్మ వాలా జెర్సీ ఇవ్వండి’ అని ఆ షాప్ అతడిని అడుగుతుంది.
దాంతో అతడు ‘రోహిత్ 45’ అని రాసి ఉన్న జెర్సీని ఆమె ముందు పెడతాడు. అది చూసిన ఆమె ఇది కాదు వేరి అంటుంది. దాంతో ఆ షాప్ ఓనర్ మీకు క్రికెట్ గురించి సరిగ్గా తెలీదు అనుకుంటా అని వ్యంగ్యంగా నవ్వుతాడు. ఆమె వెంటనే మీకే ఎక్కవ తెలీదు అని ఠక్కున ఫోన్ లో మహిళా క్రికెటర్ ‘దీప్తీ శర్మ’ ఫోటో చూపిస్తుంది. దాంతో కంగుతిన్న షాప్ ఓనర్ గుటకలు మింగుతూ.. ఆమె అడిగిన జెర్సీని తీసి ఇస్తాడు. ఈ ఒక్క వీడియోని చూస్తేనే అర్థం అవుతుంది భారత క్రికెట్ లో మహిళలకు ఏ మేరకు ఆదరణ దక్కుతుందో. అయితే మహిళల క్రికెట్ ను గుర్తించండి అనే ఉద్దేశంలో తీసిన ఈ వీడియో అద్భుతంగా ఉంది.
అయితే మహిళా క్రికెట్ ను పైకి లేపడానికి రోహిత్ శర్మ లాంటి క్రికెటర్ ను అవమాన పరుస్తారా అంటూ కొంత మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ లో శర్మ అంటే ఒక్క రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, సందీప్ శర్మ లాంటి ఆటగాళ్లు లేరా అని ఇంకొందరు గుర్తు చేశారు. ఇక ఫిబ్రవరి 10న ప్రారంభం అయ్యి 26న ముగుస్తుంది వుమెన్స్ టీ20 వరల్డ్ కప్. తన తొలి మ్యాచ్ ను టీమిండియా 12న పాక్ తో తలపడనుంది. మరి వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TeamIndia’s set to take the world and paint it blue! 💙💪🏼 Watch #WomenInBlue create H̵i̵s̵ Her-story as they get set to conquer the world! 💯
Stay tuned🏏 for the #ICCWomensT20WorldCup, starting Feb 10, only on Star Sports & Disney+Hotstar.#BlueKnowsNoGender pic.twitter.com/nfceku35po
— Star Sports (@StarSportsIndia) January 23, 2023