టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సూపర్-12 పోరులో ఆసీస్ 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారులు 179 పరుగులు చేయగా, అనంతరం ఐర్లాండ్ జట్టు 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచులో ఐర్లాండ్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ ఒంటరి పోరాటం చేశాడు. వచ్చిన బ్యాటర్లు వచినట్లుగానే పెవిలియన్ చేరుతున్నా, తాను మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు. టక్కర్ రాణించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేసింది. ఈ విజయంతో ఆసీస్ రెండవ స్థానానికి చేరుకుంది.
తొలుత ఐర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన కంగారూలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 63 పరుగులతో రాణించగా, స్టోయినిస్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ 3 వికెట్లు తీయగా, లిటిల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. ఐర్లాండ్ వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వచ్చిన బ్యాటర్లు వచినట్లుగానే పెవిలియన్ చేరుతున్నా, తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న టక్కర్, ఒక సిక్స్, 9 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్, స్టార్క్, మాక్స్ వెల్,జంపా.. తలా 2 వికెట్లు తీయగా, స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టాడు.
Lorcan Tucker dent Australia’s NRR with a fighting fifty.#AUSvIRE | #T20WorldCup pic.twitter.com/8o1kcr37da
— CricTracker (@Cricketracker) October 31, 2022
కాగా, ఈ మ్యాచులో ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తీ అద్భతమైన ఫీల్డింగ్ చేశాడు. 14 ఓవర్ రెండో బంతిని అదిర్ వేయగా.. స్టోయినిస్ దాన్ని సిక్స్ కొట్టాలని పైకి లేపాడు. బంతి గాల్లో లేచింది. పరుగెత్తుకుంటూ వచ్చిన మెక్‌కార్తీ క్యాచ్ పట్టాడు. కానీ బౌండరీలో పడిపోతున్నానని తెలిసి బంతిని బయటకు వేశాడు. ఈ విన్యాసాలు చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారంటే నమ్మొచ్చు. ఇక ఈ విజయంతో ఆసీస్ గ్రూప్-1లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆసీస్ తదుపరి మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుండగా, రేపు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ కీలకం కానుంది.
Barry McCarthy remember the name.#AUSvIRE #AUSvsIRE#T20WorldCuppic.twitter.com/5NrHHLoERL
— Cricket Videos🏏 (@Crickket__Video) October 31, 2022
Australia complete a fine win to keep semi-final hopes alive 💪#T20WorldCup | #AUSvIRE | 📝: https://t.co/CW4eQlDZGZ pic.twitter.com/WdUP4gLfZE
— ICC (@ICC) October 31, 2022