ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడి పాకిస్థాన్‌ను ముంచేసిందని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌ను లైవ్ చూసిన అక్తర్.. టీమిండియా గెలవాలని బలంగా కోరుకున్నట్లు ఉన్నాడు. మ్యాచ్‌కు ముందే.. పాకిస్థాన్ కోసం టీమిండియా సౌతాఫ్రికాపై విజయం సాధించాలని అన్నాడు. కానీ.. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే టీమిండియా వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో.. ‘పాకిస్థాన్ కోసం టీమిండియా గెలవాలని నేను కోరుకుంటే.. వీళ్లేంటి అప్పుడు నాలుగు వికెట్లు కోల్పోయి.. పాకిస్థాన్‌ను ముంచేసేలా ఉన్నారు.’
అంటూ అక్తర్ ఒక వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు.
కాగా.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని అందరి కంటే ఎక్కువగా.. పాక్ క్రికెటర్లు, పాకిస్థాన్ అభిమానులే కోరుకున్నారు. టీమిండియా విజయం సాధించడం వారికి చాలా అవసరం. నిజానికి మనకు చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థానీయులు ఆదివారం మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. రోహిత్, కోహ్లీ అవుట్ అయితే తలలు పట్టుకోవడం.. మార్కరమ్, మిల్లర్ పరుగులు చేస్తే పళ్లు కొరకడాలు.. ఈ సారి వాళ్లు చేశారు. ఎందుకంటే.. ఈ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే టీమిండియా సౌతాఫ్రికాను ఓడించాల్సి ఉంది. కానీ.. అలా జరగలేదు. సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో.. పాక్ అభిమానులు టీమిండియా కావాలనే ఓడిందని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారు.
టీమిండియా సౌతాఫ్రికా చేతుల్లో ఓడినా.. పాకిస్థాన్‌కు ఇంకా సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నా.. అది అంత ఈజీ కాదు. చాలా సమీకరణాలు పాక్‌ను అనుకూలంగా మారాలి. పాకిస్థాన్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలిచితీరాలి. అలాగే టీమిండియా మిగిలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడాలి. అప్పుడు బంగ్లాదేశ్ రన్‌రేట్ పాకిస్థాన్ రన్‌రేట్ కంటే తక్కువగా ఉండాలి. ఇలా తికమక పెట్టే సమీకరణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో సంచలనాలు జరిగితే తప్ప సాధ్యమయ్యే ఈక్వేషన్లు కావు. ఎందుకంటే టీమిండియా తర్వాత రెండు మ్యాచ్‌ల్లో జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అద్భుతం జరిగితే తప్పా.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోవడం జరగదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిస్తే.. పాక్ అధికారికంగా ఇంటికి వెళ్తుంది. ఇప్పటికే పాక్ ఇంటికెళ్లడం ఖాయమే కానీ.. లెక్కలన్ని పూర్తి కావాల్సి ఉంది.
Bhaiyo bahut jaldi main hain? pic.twitter.com/QVIf9Y4bj0
— Shoaib Akhtar (@shoaib100mph) October 30, 2022
Average mindset, Average results. Thats the reality, face it. pic.twitter.com/plLZ11Qx0Y
— Shoaib Akhtar (@shoaib100mph) October 27, 2022