చివరి దశకు చేరుకున్న టీ20 వరల్డ్ కప్‌లో తొలి సెమీస్ రసవత్తరంగా సాగుతోంది. న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి పాకిస్థాన్ కొంత పైచేయి సాధించిందని చెప్పవచ్చు. టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కానీ.. తొలి ఓవర్‌లోనే పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ కివీస్‌కు షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్‌ను తొలి ఓవర్ మూడో బంతికి అవుట్ చేసి న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. పిచ్ కూడా బాగా స్లోగా ఉండటంతో మరో ఓపెనర్ కావ్వెతో కలిసి కెప్టెన్ కేన్ మామ ఇన్నింగ్స్‌ను నిదానంగా ముందుకు నడిపించాడు. పవర్‌ప్లే చివరి ఓవర్ చివరి బంతికి లేని పరుగు కోసం వెళ్లిన కావ్వె.. షాదాబ్ అద్భుత త్రోకు రనౌట్ అయ్యాడు.
దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ కేవలం 38 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయి. ఇక్కడి నుంచి మిచెల్‌తో కలిసి విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. కానీ.. మరి నెమ్మదిగా ఆడాడు. 42 బంతులను ఎదుర్కొన్న కేన్ మామ ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో అఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చిన కేన్.. 17వ ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్నా.. దాదాపు 7 ఓవర్లు తనే ఆడినా.. స్కోర్‌ను మాత్రం పరిగెత్తించలేకపోయాడు. డారిల్ మిచెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో కొంత ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్‌కు ఫైటింగ్ టార్గెట్ అయిన దక్కింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 152 పరుగులను స్కోర్ బోర్డుపై ఉంచింది. అయితే.. పిచ్ బ్యాటింగ్‌కు ఇబ్బందిగా ఉండి.. బాల్ కాస్త ఆగి వస్తున్నట్లు కనిపించింది. అయినా కూడా కేన్ మామ మరీ నెమ్మదిగా ఆడటంతో కివీస్‌కు రావాల్సిన స్కోర్ కంటే చాలా తక్కువ వచ్చిందనే చెప్పాలి. 153 పరుగుల టార్గెట్‌ను పాక్ ఛేదించి గెలిస్తే మాత్రం.. కివీస్ ఓటమికి కేన్ మామ స్లో బ్యాటింగే కారణంగా మారొచ్చు.
Big wicket for Pakistan.
Captain Kane Williamson departs after scoring 46(42).
📸: Disney + Hotstar#CricTracker #KaneWilliamson #NZvPAK #T20WorldCup pic.twitter.com/IVX1UiPwm5
— CricTracker (@Cricketracker) November 9, 2022