ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. భారత టాపార్డర్ దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అయితే.. స్వల్ప లక్ష్యఛేదనలో సౌతాఫ్రికాను భారత పేసర్లు కూడా ఆరంభంలో ఇబ్బంది పెట్టారు. తొలి 10 ఓవర్ల వరకు టీమిండియానే ఆధిపత్యం ప్రదర్శించినా.. చెత్త ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్రొటీస్ బ్యాటర్లలో మార్కరమ్, మిల్లర్ అర్ధ సెంచరీలతో రాణించారు.
ఇక మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని కూడా భారత క్రికెట్ అభిమానులు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడం తమకెంతో సంతోషాన్ని ఇస్తుందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. దీనికి కారణంగా ఒక సెంటిమెంట్‌ను వారు.. తెరపైకి తెస్తున్నారు. అదేంటంటే.. 2011లో టీమిండియా ధోని సారథ్యంలో వన్డే వరల్డ్ కప్‌ను నెగ్గిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా టీమిండియా లీగ్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడింది. అప్పుడు కూడా రెండు బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా భారత్‌పై విజయం సాధించింది. ఇప్పుడు కూడా సేమ్ రెండు బంతులు మిగిలి ఉండగానే 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది.
ఈ సెంటిమెంట్‌పైనే కొంతమంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తారు. 2011లో సౌతాఫ్రికాపై ఓడిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచిందని.. ఇప్పుడు కూడా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా దీనికి మరో రెండు సెంటిమెంట్లను కూడా జత చేస్తున్నారు. అవేంటంటే.. 2011లో పసికూన ఐర్లాండ్.. పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించింది.. ఈ టీ20 వరల్డ్ కప్‌లోనూ ఐర్లాండ్.. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.. అలాగే ధోని చెప్పినట్లు ఓరియో బిస్కెట్ లాంచ్ అయిన ఏడాది 2011, అదే ఏడాది టీమిండియా వరల్డ్ కప్ నెగ్గింది. ఈ ఏడాది ఓరియో మరో ఎడిషన్‌ను లాంచ్ చేస్తూ.. ధోని ఈ వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుస్తుందని చెప్పాడు. ఇలా సెంటిమెంట్స్‌ను నమ్మే వాళ్లు.. ఈ మూడు సెంటిమెంట్స్ టీమిండియాకు అనుకూలంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడినా.. మాకూ అదే కావాలంటూ హ్యాపీగా ఉన్నారు.
South Africa defeated India with 2 balls to spare in 2011 World Cup.
South Africa defeated India with 2 balls to spare in 2022 World Cup.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2022
IND vs SA Last 9 matches in ICC Tournaments
🇿🇦 Won (2011)
🇮🇳 Won (2012)
🇮🇳 Won (2013)
🇮🇳 Won (2014)
🇮🇳 Won (2015)
🇮🇳 Won (2017)
🇮🇳 Won (2019)
🇿🇦 Won (2022)*#T20WorldCup— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 30, 2022
2011 Worldcup IND Lost vs SA in Last Over!
Left Hander Peterson finished with Boundary!2022 T20 Worldcup IND Lost vs SA in Last Over!
Left Hander Miller finished with Boundary!#T20worldcup22 #INDvsSA pic.twitter.com/uA3BsTnkGN— 🍫𝙰ß𝚞𝙻🌻Ꮋυ$$αιη ( اللہ اکبر) (@iam_abul11) October 31, 2022
In 2011, India lost to South Africa
In 2022,India lost to South Africa againSo,WC is coming home 🏆#INDvsSA #T20WorldCup pic.twitter.com/5Ee4u5JObg
— Muttu ms (@muttu1745) October 30, 2022
And SA won by 2 balls left in 2011 as well as in 2022 also..#itshappening… #INDvsSA pic.twitter.com/qW5n3U3N6v
— Rt Now High on Cricket (@i_r4vi) October 30, 2022