సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు చెబితే ప్రపంచంలోని ఏ బౌలరైనా ఉలిక్కిపడుతున్నాడు. ప్రస్తుతం అతన్ని అవుట్ చేసేందుకు ఏ బౌలర్ దగ్గర కూడా సరైన బంతి లేదు. అతను ఫలానా షాట్ ఆడితే అవుట్ అవుతాడు అనే నమ్మకం ఎవరీ లేదు. బంతి ఎక్కడ వేస్తే పరుగులు సమర్పించకుండా బతికిపోతామో అని ఆలోచించని బౌలర్ల లేడు ప్రస్తుతం సూర్య సునామీ టీ20 వరల్డ్ కప్ 2022లో తన ప్రతాపం చూపుతోంది. సూర్య తుఫాన్‌కు ఇప్పటికే జింబాబ్వే జట్టు కొట్టుకుపోయింది. చివరి ఐదు ఓవర్లు మ్యాచ్‌కే కాదు.. మొత్తం టోర్నీకే హైలెట్‌గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. సూర్య ఆడుతున్న షాట్లకు ఏ పేరు పెట్టాలో తెలియక కామెంటేటర్లు సైతం తికమకపడ్డారంటేనే అర్థం చేసుకోండి.. సూర్య ఎలాంటి విధ్వంసం సృష్టించాడో.
జింబాబ్వేతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 25 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్.. 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి దుమ్మురేపాడు. 150, 160 మధ్య వస్తుందనుకున్న టార్గెట్.. సూర్య ప్రతాపానికి ఏకంగా 186కు చేరింది. ఇంత భారీ స్కోర్ వస్తుందని 15 ఓవర్ల వరకు కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ.. సూర్య ఆడిన ఇన్నింగ్స్‌తో అది సాధ్యమైంది. ఈ ఒక్క ఇన్నింగ్స్ అనే కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి సూర్యది దూకుడే మంత్రం. అరంగేట్రం మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ బాది.. తనకు ఎలాంటి భయం లేదని చెప్పకనే చెప్పాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోని సూర్య.. సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు.
జట్టు ఎలాంటి పరిస్థితిల్లో ఉన్నా.. పిచ్ ఎలా ఉన్నా.. ఎదురుగా ఎంత తురుమ్‌ఖాన్ బౌలర్ ఉన్న కూడా సూర్య ఆటలో మార్పు ఉండదు. పైగా తనపై వచ్చే విమర్శలు, ప్రశంసలు సూర్యను ఏ మాత్రం ప్రభావితం చేయవు. అందుకే అతను ఏ మాత్రం ఒత్తిడి, టెన్షన్ , భయం లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. సూర్య కుమార్ యాదవ్ ఇంతలా సక్సెస్ అయ్యేందుకు ప్రధాన కారణం.. అతని భార్య పెట్టిన కఠినమైన రూలే అంట. ఆ రూల్ ఏంటంటే.. మ్యాచ్‌కు చాలా సమయం ముందే సూర్యకుమార్ యాదవ్ ఫోన్‌ను అతని భార్య దేవిషా శెట్టి తీసుకుని దగ్గర పెట్టుకుంటుంది. దీంతో ఇతర విషయాల గురించి ఆలోచించకుండా సూర్యకుమార్ కేవలం మ్యాచ్‌పైనే ఫోకస్ పెట్టేస్తాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు గేమ్ ప్లాన్ ఏంటి? పిచ్ ఎలా ఉంది? తనపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఇలాంటి విషయాలేవి సూర్యకు తెలిసే అవకాశం లేకుండా చేయడంతో.. అతను ఫ్రెష్ మైండ్‌తో బరిలోకి దిగి దుమ్మురేపుతున్నట్లు తెలుస్తుంది.
Who is #DevishaShetty, #SuryakumarYadav‘s wife and ‘life coach’ who helped script his rise to the top
READ here!https://t.co/btypJTjoGb
— DNA (@dna) November 7, 2022