టీ20 వరల్డ్ కప్ 2022లో రషీద్ ఖాన్ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 48 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గడగడలాడించాడు. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చావుతప్పి కన్నులొట్టబోయి గెలిచి మొత్తానికి సెమీస్ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్, టిమ్ డేవిడ్‌లను ఈ మ్యాచ్‌లో పక్కనపెట్టారు. వారి స్థానాల్లో కామెరున్ గ్రీన్, స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ కూడా బ్యాటింగ్‌లో విఫలం అయ్యారు. మిచెల్ మార్ష్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు, మ్యాక్స్‌వెల్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు చేసి రాణించడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
ఇక లక్ష్యఛేదనకు దిగిన అఫ్ఘానిస్థాన్ 13వ ఓవర్ వరకు పటిష్ట స్థితిలో నిలిచి మ్యాచ్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. కానీ.. మాక్స్వెల్ గుల్బాదిన్‌ను రనౌట్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయింది. ముగ్గురు బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఆస్ట్రేలియా వైపు మొగ్గింది. కానీ.. చివర్లో రషీద్ ఖాన్ శివాలెత్తాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి.. మ్యాచ్ గెలిపించేలా కనిపించాడు. చివరి మూడు ఓవర్లలోనే 43 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కానీ.. అప్పటికే కావాల్సిన పరుగులు భారీగా ఉంటడంతో రషీద్ పవర్ హిట్టింగ్ సరిపోలేదు. దీంతో ఆసీస్ 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ విజయంతో ఆసీస్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. కాగా.. ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్‌పై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే.. ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా కథ ముగిసినట్టే.
4⃣8⃣* (23), nearly pulling off a victory – Rashid Khan, you absolute beauty! 🙌#AUSvsAFG #T20WorldCup pic.twitter.com/oGZjBRdtog
— MI Cape Town (@MICapeTown) November 4, 2022
KhaaNaaa You True fighter 🔥#AUSvsAFG pic.twitter.com/qS7ktuoZ8d
— Sa HiB (LQ) (@MohammadArfatM2) November 4, 2022