ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న పొట్టి ప్రపంచ కప్ రసవత్తరంగా మారింది. దీనంతటికి కారణం.. వరుణుడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. సూపర్-12 స్టేజులో ఇప్పటికే సగం మ్యాచులు ముగిసినా సెమీస్ చేరే జట్లు ఏవన్నది అంతుపట్టడం లేదు. దీంతో భారమంతా ఇదిలా ఉంచితే.. ఆదివారం ఇండియా- సౌతాఫ్రికా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే జట్టు ఎదన్నది నిర్ణయించనుంది. ఈ మ్యాచులో భారత బ్యాటర్లకు మా పేస్ అటాక్ ఎలా ఉంటదో రుచి చూపిస్తామంటూ సౌతాఫ్రికా బౌలర్ ఎన్రిచ్ నోర్ట్జె రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు.
పెర్త్ వేదికగా ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్ జరగాల్సివుంది. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో భారత్ గెలిస్తే సెమీస్ చేరడం పక్కా. ఇప్పటివరకు 2 మ్యాచులు ఆడిన టీమిండియా రెండింటిలో విజయం సాధించి 4 పాయింట్లతో టేబుల్ టాప్ లో ఉంది. మరోవైపు ప్రోటీస్ 2 మ్యాచులు ఆడగా, ఒక దానిలో విజయం సాధించగా మరొకటి వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం 3 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఈ పరిణామాల మధ్య దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నోర్ట్జె కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు తమ బౌలింగ్ అటాక్ తడాఖా చూపించబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశాడు.
A fiery spell from Anrich Nortje against Bangladesh 🔥#SAvBAN | @AnrichNortje02 pic.twitter.com/Rbub3Q9xoL
— CricTracker (@Cricketracker) October 27, 2022
ప్రపంచంలోనే సౌతాఫ్రికా బౌలింగ్ అటాక్‌ను ‘ది బెస్ట్’ అని అభివర్ణించిన నోర్ట్జె, తమ బౌలింగ్‌లో వైరుధ్యం ఉందని, అది ఎలాంటి బ్యాటర్లనయినా ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. వేగం, వైరుద్ధ్యం, లైన్ అండ్ లెంగ్త్.. ఇవన్నీ తమ బౌలింగ్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.” భారత్ తో జరగబోయే మ్యాచ్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచులో మేము ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఫలితంగా పాయింట్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రతి పాయింట్ అవసరమే. ఏది ఏమైనా ఈసారి టీ20 ప్రపంచకప్‌ను కొట్టబోతోన్నాం..” అని నోర్ట్జె చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు పెర్త్ చేరుకొని ప్రాక్టీస్ లో మునిగిఉన్నారు. మ్యాచ్ సమవుజ్జీ జట్ల మధ్య కావడం వల్ల ఈ మ్యాచ్‌లో పైచేయి ఎవరిదన్నది ఉత్కంఠతను రేపుతోంది.
Anrich Nortje challenges #TeamIndia ahead of the T20 World Cup clash against the Men in Blue‼️
“We definitely think that the last two seasons have been a great team, and hopefully, we can win the Cup this season.”#T20WorldCup #INDvsSA #AnrichNortje pic.twitter.com/6g1dYgYqbL
— OneCricket (@OneCricketApp) October 29, 2022
Dale Steyn said, “Kagiso Rabada and Anrich Nortje can help South Africa win the T20 World Cup”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2022