ఏబీ డివిలియర్స్.. ఈ పేరు వింటేనే భయం తెలియని బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. ఏ యాంగిల్లోనైనా బంతిని కసిగా బాదగల వండర్ క్రికెటర్ అతను. అందుకే డివిలియర్స్ కు మిస్టర్ 360 అనే బిరుదు ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా ఏబీడీ మార్క్ బ్యాటింగ్ క్రికెట్ ఫ్యాన్స్ మదిలో అలానే నిలిచిపోయింది. ఏబీడీ బ్యాటింగ్ చేస్తుంటే బాల్ ఎక్కడ వేయాలో తెలియక బౌలర్లు తల గొక్కుంటే, ఎక్కడొచ్చి తగులుతుందో అని ప్రేక్షకులు భయంతో తలపట్టుకుంటారు. ఇక ఐపీఎల్ పుణ్యామాని ఏబీడీ బ్యాటింగ్‌ను చాలా సార్లు చూసి మురిసిపోయే భాగ్యం మనకు దక్కింది.
అంతటి విధ్వంసం సృష్టించే ఆటగాడు తమ జట్టులో కూడా ఒకడుంటే బాగుండు.. అనుకోని జట్టు లేదంటే అతిశయొక్తి కాదు. అయితే.., ఇప్పుడు సూపర్ న్యూస్ ఏంటంటే.. టీమిండియాలో కూడా ఇప్పుడు అలాంటి ఆటగాడు ఒకరు వచ్చి చేరారు. ఏబీడీ ఎలాగైతే ఏ బౌలర్‌కు భయపడడో ఇతను కూడా అంతే..! భయం అంటే తెలియకుండా ఆడుతున్నాడు. ఏబీడీ ఆడినట్లే గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతున్నాడు. మొత్తానికి ఇండియన్ ఏబీడీ అని పిలిపించుకునే స్థాయి ఆటని కనపరిస్తున్నాడు. అతను మరెవరో కాదు. టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్.
ప్రస్తుతం టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ఒక సెన్సెషన్. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సూర్య ఉన్నాడులే అనే నమ్మకం కలిగించే ప్లేయర్. ఒకే రకమైన షాట్లు కాకుండా ఏ బంతిని ఎలా కొడతాడో కూడా తెలియకుండా కొట్టే టాలెంట్, తెగువ ఉన్న ఆటగాడు. అప్పట్లో ఏబీడీని ఇతనేంటి ఇలా ఆడుతున్నాడు.. వేరే గ్రహం నుంచి ఏమన్నా వచ్చాడా? అని అనుకునే వాళ్లు. ఇప్పుడు సూర్య ఆటను చూసి అలాగే ఫీల్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. సూర్య బ్యాటింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో, జట్టు అవసరాన్ని బట్టి అంతే బాధ్యతగా కూడా ఆడతాడు. సూర్యకుమార్ యాదవ్ తాను ఎదుర్కొన్న తొలి అంతర్జాతీయ బంతిని సిక్స్ కొట్టాడంటే.. ఎంతటి తెగువగల క్రికెటరో అర్థం చేసుకోవచ్చు.

మిస్టర్ 360 ఏబీడీ లాంటి బ్యాటింగ్ శైలితో ఇండియన్ ఏబీడీగా మారుతున్న సూర్యకుమార్‌ను చూసి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి వరకు 14 అంతర్జాతీయ టీ20లు ఆడిన సూర్య 165.57 స్ట్రైక్‌రేట్‌తో 351 పరుగులు చేశాడు. మరి సూర్యకుమార్ యాదవ్ మరో ఏబీడీ అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Sam (@sam1998011) February 20, 2022
