ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022 కోసం టీమిండియా ఇప్పటికే ఆసీస్ గడ్డపై ల్యాండైంది. పెర్త్‌లో ప్రాక్టీస్ సెషన్స్ కోసం కాస్త ముందుగానే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. గురువారం 14 మంది ఆటగాళ్లు, 16 మంది కోచింగ్ ప్లస్ సపోర్టింగ్ స్టాఫ్‌తో కూడిన బృందం పెర్త్‌కు చేరుకుంది. కాగా.. ఈ ప్రయాణానికి ముందు ఆటగాళ్లు గ్రూప్ ఫొటో దిగారు. సూట్స్‌లో ఆటగాళ్ల లుక్ అదిరిపోయింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. కాగా.. ఆస్ట్రేలియా ప్రయాణానికి ముందు టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను అతని సతీమణి దేవిషా శెట్టి రెడీ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఫొటో షూట్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌ను భార్య దేవిషా స్వయంగా ముస్తాబు చేసింది. ఈ సందర్భంగా తొలి టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను దగ్గరుండి రెడీ చేయడంతో పాటు క్షేమంగా వెళ్లి టీ20 వరల్డ్ కప్‌తో తిరిగి రావాలని కోరినట్లు తెలుస్తుంది. కాగా.. సూటూ, బూటు వేసుకున్న సూర్యకుమార్ యాదవ్ భార్యతో పాటు తల్లిదండ్రులతో కలిసి ఫొటోలు దిగాడు. మొదటి సారి వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నీకి వెళ్లే ముందు సూర్య ఇలా తన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు.
కాగా.. ఎప్పుడు మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన టీమిండియా.. మళ్లీ ఆ పొట్టి ఫార్మాట్ కప్‌ను ముద్దడలేదు. 15 ఏళ్లుగా భారత క్రికెట్ అభిమానులు టీ20 వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే కనీసం ఈ సారైనా టీ20 వరల్డ్ కప్ గెలిచి 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషాతో పాటు యావత్ భారతదేశం కోరుకుంటుంది. అందుకే ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను షేర్ చేస్తూ.. వరల్డ్ కప్ గెలిచి రావాలని కోరుకుంటున్నారు. ఆల్‌దిబెస్ట్ చెబుతూ.. తమ మద్దతు తెలుపుతున్నారు.
🥹🥹💓💗 pic.twitter.com/QYZC16oJNf
— Out Of Context Cricket (@GemsOfCricket) October 6, 2022
ఇది కూడా చదవండి: వీడియో: బాబరైనా, మార్కరమైనా.. కుల్దీప్ స్పిన్ ముందు బచ్చాలే!