ఐపీఎల్ 2022లో ఎలాగైనా సత్తా చాటాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, పేసర్ ఉమ్రన్ మాలిక్, హార్డ్ హిట్టర్ సమద్‌ను రిటైన్ చేసుకున్న SRH.. కీలక ఆటగాళ్లను వేలంలో దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రషీద్‌ఖాన్ స్థానంలో అశ్విన్, వార్నర్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు కీలకమైన హెచ్ కోచ్ పదవిపై SRH దృష్టిపెట్టినట్లు సమాచారం.
2021 వరకు కోచ్‌గా ఉన్న ట్రెవర్ బెలీస్ జట్టును వీడి లక్నో ఫ్రాంచైజ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అతని స్థానంలో ఒక సూపర్ కోచ్‌ను నియమించేందుకు SRH ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని SRH తమ హెడ్‌కోచ్‌గా నియమించుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన శాస్త్రి, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.
కోచ్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన శాస్త్రిపై SRH నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. రవిశాస్త్రితో చర్చలు జరుపుతూ.. ఎలాగైనా అతన్ని కోచ్‌గా తెచ్చేందుకు ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి SRHకు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
