‘డేవిడ్ వార్నర్’ పేరుకి ఆస్ట్రేలియా క్రికెటరే అయినా.. భారత్ అతనికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మైదానంలో బ్యాటుతోనే కాదు.. సోషల్ మీడియాలో తన పోస్టులు, డాన్సులు, టిక్‌టాక్‌లతో అభిమానులను అలరిస్తుంటాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయాల్లో డేవిడ్ పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రస్తుత సీజన్లో మాత్రం డేవిడ్ వార్నర్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అతడి ఐపీఎల్ కెరీర్లోనే అత్యల్ప 110.28 స్ట్రైక్ రేట్‌తో ఫామ్‌లోకి రావడానికి చాలానే తిప్పలు పడ్డాడు.
వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక్కటి మాత్రమే గెలిచి పాయిట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమయ్యారు. ఈ సీజన్లో ఫామ్ కోల్పోవడమే కాదు.. కెప్టెన్సీని కూడా కోల్పోయాడు డేవిడ్ వార్నర్. ఆఖరికి మ్యాచ్‌లో డ్రింక్స్ కూడా మోశాడు. అయినా టీమ్‌పై తన అభిమానాన్ని చంపుకోలేదు. బ్రింగ్ బ్యాక్ వార్నర్ అంటూ హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు. మరి, ఐపీఎస్ సీజన్ 14 సెకెండ్ హాఫ్‌లోనైనా.. టీమ్‌లోకి వస్తాడా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. తాజాగా ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన డేవిడ్ వార్నర్ అభిమానుల సందేహాలను మరింత సంక్లిష్టంగా మార్చాడు.
‘డేవిడ్ సెకెండ్ హాఫ్‌లో నీ సెంచరీ కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ ఓ అభిమాని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందుకు డేవిడ్ వార్నర్ తన స్టైల్లో సమాధానమిచ్చాడు. ‘నేను కూడా అందుకోసమే ఎదురుచూస్తున్నా? నేను జట్టులో సెలెక్ట్ అవుతానో? లేదో? అంటూ మరో ప్రశ్నను లేవనెత్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మాత్రం డేవిడ్ వార్నర్ కచ్చితంగా టీమ్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. అసలు విషయం తెలియాలంటే సెప్టెంబర్ 22న దుబాయి వేదికగా జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వరకూ ఆగాల్సిందే మరి.