సన్ రైజర్స్ జట్టు కప్ కొట్టేసింది. ఆ దేశంలో జరిగిన టీ20 లీగ్ తొలి సీజన్ లోనే టోర్నీ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లోనూ అదే ఊపు కంటిన్యూ చేసి కప్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
సన్ రైజర్స్ జట్టు ట్రోఫీ గెలిచేసుకుంది. అవును మీరు విన్నది కరెక్టే. కానీ మన దేశంలో కాదు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్ తాజాగా జరిగింది. ఈ టోర్నీ ఫైనల్ ఆదివారం జరగ్గా.. ఆ మ్యాచులో అద్భుత విజయం సాధించిన సన్ రైజర్స్ టీమ్.. టైటిల్ ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచులో సన్ రైజర్స్ బౌలర్లు, బ్యాటర్లు అందరూ కూడా రెచ్చిపోయి ఆడారు. దీంతో గెలుపు సులభమైపోయింది. ఈ క్రమంలోనే కావ్య పాప కూడా ఫుల్ హ్యాపీగా ఫీలవుతుంది. లీగ్ ప్రారంభంలో పలు మ్యాచుల్లో ఓడిన సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్స్ జట్టు.. ఆ తర్వాత వరస విజయాలు సాధించి ఫైనల్ కు చేరింది. లీగ్ దశలో ప్రిటోరియా క్యాపిటల్స్ పై రెండుసార్లు ఓడిపోయింది. ఇప్పుడు అదే జట్టుని ఫైనల్లో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అదే ఊపుని ఐపీఎల్ లోనూ కంటిన్యూ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జోహెన్స్ బర్గ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. 19.3 ఓవర్లలో 135 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ 21, జేమ్స్ నీషమ్ 19 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్ రైజర్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వే నాలుగు వికెట్లతో క్యాపిటల్స్ జట్టుని చెదరగొట్టాడు. మంగల, బార్టమాన్ చెరో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. జాన్సన్, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. 16.2 ఓవర్లలోనే 137 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇక సెమీస్ లో సెంచరీతో చెలరేగడంతో పాటు జట్టును ఫైనల్ కు చేర్చిన మార్క్రమ్.. మొత్తంగా 11 మ్యాచుల్లో 366 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రారంభ సీజన్ లో సన్ రైజర్స్ తొలుత లీగ్ దశలో కొన్ని మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో జట్టు ఓనర్ కావ్యపై పలువురు ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు అదే జట్టు ఫైనల్లో గెలిచేసరికి ఆమెను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరైతే సారీ కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న సన్ రైజర్స్ జట్టు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ అదే ఊపు కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే రెండు జట్లలోనూ పలువురు ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా దాదాపు ఒకటేనని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు ఏం చేస్తుందో చూడాలి. మరి సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్స్ ట్రోఫీ గెలుచుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
The party has just started 😍pic.twitter.com/nSZYFbu5Pu
— Sunrisers Eastern Cape (@SunrisersEC) February 12, 2023