సన్ రైజర్స్ జట్టు కప్ కొట్టేసింది. ఆ దేశంలో జరిగిన టీ20 లీగ్ తొలి సీజన్ లోనే టోర్నీ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లోనూ అదే ఊపు కంటిన్యూ చేసి కప్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
సన్‌రైజర్స్ టీమ్ సత్తా చాటింది. కెప్టెన్ మార్కరమ్ సెంచరీతో ముందుండి నడిపించడంతో లీగ్ తొలి సీజన్‌లోనే ఫైనల్స్‌కు చేరింది. ఎల్లో ఆర్మీ సూపర్ కింగ్స్‌పై సెమీస్‌లో విజయం సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తున్న వేళ.. స్టార్ బ్యాటర్లు, బౌలర్లు దుమ్మురేపుతున్నారు. వేలంలో కోట్లకు కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. అయితే ఈ వేలాల్లో కొంత మంది స్టార్, సీనియర్ ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. వారిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి వారిలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఒకడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ లో బవుమాను ఎవరూ కొనుగోలు చేయలేదు. […]
సాధారణంగా హీరోలు గానీ, హీరోయిన్ లు గానీ ఎక్కడికైనా వెళ్తే వారికి అభిమానులు నుంచి లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. ఇదే సంప్రదాయం క్రికెట్ లో కూడా ఎప్పటి నుంచో ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమను ప్లకార్డులపై రాసి ప్రదర్శిస్తుంటారు ఫ్యాన్స్. ఇక తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఓ పెళ్లి ప్రపోజల్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. IPL మిస్టరీ గర్ల్ గా పేరుతెచ్చుకుంది కావ్యా […]
ఫ్రాంచైజీ క్రికెట్ లో అసలైన మజాను పంచడానికి మరో టీ20 లీగ్ సిద్ధమైంది. బీసీసీఐ, ఐపీఎల్ పెద్దల కనుసన్నల్లో జరుగుతోన్న మినీ ఐపీఎల్(దక్షిణాఫ్రికా టీ20 (ఎస్ఏ20)) లీగ్ వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 314 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా, యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు.. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కెప్టెన్లు టెంబా బవుమా, డీన్ ఎల్గర్ అన్ సోల్డ్ ఆటగాళ్లుగా మిగిపోయారు. ఈ ప్రక్రియతో ఆటగాళ్ల ఎంపిక దాదాపు […]