సన్‌రైజర్స్ టీమ్ సత్తా చాటింది. కెప్టెన్ మార్కరమ్ సెంచరీతో ముందుండి నడిపించడంతో లీగ్ తొలి సీజన్‌లోనే ఫైనల్స్‌కు చేరింది. ఎల్లో ఆర్మీ సూపర్ కింగ్స్‌పై సెమీస్‌లో విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్‌ఏ20 లీగ్ తుది అంకానికి చేరుకుంది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం రాత్రి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ – జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన సెమీఫైనల్ పోరులో సన్ రైజర్స్ 14 రన్స్ తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. సన్ రైజర్స్ సారథి ఎయిడెన్ మార్‌క్రమ్ సెంచరీతో చెలరేగి తొలి సీజన్‌లోనే టీమ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ఒక దశలో 10 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్ (58 బంతుల్లో 100) వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
మార్‌క్రమ్‌కు తోడుగా జోర్డాన్ హెర్మాన్ (36 బంతుల్లో 48) జతకలవడంతో సన్ రైజర్స్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరూ కలసి 99 పరుగులు జోడించారు. అయితే కీలక సమయంలో సమన్వయ లోపంతో జోర్డాన్ రనౌట్ అయ్యాడు. అప్పటివరకు నెమ్మదిగా ఆడుతూ వచ్చిన మార్‌క్రమ్ ఒక్కసారిగా జోరు పెంచాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ రెచ్చిపోయాడు. ఓవర్లన్నీ ముగిసేసరికి సన్ రైజర్స్ 5 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను విలియమ్స్ 4 వికెట్లతో చావుదెబ్బ తీశాడు. దీంతో జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగలే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్ (54 బంతుల్లో 96) జట్టు గెలుపు కోసం ఆఖరి వరకు పోరాడాడు. జోబర్గ్‌పై గెలిచిన సన్ రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
అయితే.. ఐపీఎల్‌లో 2016లో ఒక సారి ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఎప్పుడు కప్ కొట్టలేదు సరికాదా.. మంచి ప్రదర్శన కూడా కనబర్చింలేదు. దానికి తోడు డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి ఆ తర్వాత జట్టును తప్పించి అనవసరపు వివాదాల్లో చిక్కుకుంది. ఐపీఎల్‌లో ప్రస్తుతం సన్‌రైజర్స్ పరిస్థితి ఇలా ఉంటే.. సౌతాఫ్రికా వేదికగా జరిగే లీగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ తొలి సీజన్‌లోనే ఫైనల్ చేరి అదరగొట్టింది. మరి కప్పు కూడా కొడితే కావ్య మారన్ సంతోషానికి హద్దు ఉండదు. మరి, సౌతాఫ్రికా టీ20 లీగ్ కప్‌ను సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ గెలుచుకుంటుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BELIEVE. 🧡 #SEC #SunrisersEasternCape #SA20 #JSKvSEC #PlayWithFire pic.twitter.com/nYN8ndsdG7
— Sunrisers Eastern Cape (@SunrisersEC) February 9, 2023
“𝘋𝘪𝘥 𝘺𝘰𝘶 𝘩𝘦𝘢𝘳 𝘵𝘩𝘦 𝘴𝘤𝘳𝘦𝘢𝘮𝘴? 𝘐𝘵 𝘸𝘢𝘴𝘯’𝘵 𝘔𝘢𝘳𝘬𝘳𝘢𝘮 𝘴𝘤𝘳𝘦𝘢𝘮𝘪𝘯𝘨, 𝘪𝘵 𝘸𝘢𝘴 𝘩𝘪𝘴 𝘱𝘢𝘳𝘵𝘯𝘦𝘳 𝘚𝘵𝘶𝘣𝘣𝘴 𝘣𝘦𝘤𝘢𝘶𝘴𝘦 𝘩𝘦’𝘴 𝘵𝘩𝘢𝘵 𝘩𝘢𝘱𝘱𝘺 𝘧𝘰𝘳 𝘩𝘪𝘮.” 😍
Stubbo at the non-striker’s end was all of us last night 🧡#JSKvSEC pic.twitter.com/2hKFzbvTKn
— Sunrisers Eastern Cape (@SunrisersEC) February 10, 2023