ఫ్రాంచైజీ క్రికెట్ లో అసలైన మజాను పంచడానికి మరో టీ20 లీగ్ సిద్ధమైంది. బీసీసీఐ, ఐపీఎల్ పెద్దల కనుసన్నల్లో జరుగుతోన్న మినీ ఐపీఎల్(దక్షిణాఫ్రికా టీ20 (ఎస్ఏ20)) లీగ్ వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 314 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా, యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు.. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కెప్టెన్లు టెంబా బవుమా, డీన్ ఎల్గర్ అన్ సోల్డ్ ఆటగాళ్లుగా మిగిపోయారు. ఈ ప్రక్రియతో ఆటగాళ్ల ఎంపిక దాదాపు పూర్తయ్యిందనే చెప్పాలి.
సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ గా నామకరణం చేసిన యాజమాన్యం.. నిబంధనల ప్రకారం వేలానికి ముందే ఇద్దరు ప్రొటిస్ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎయిడెన్ మార్కరమ్ తో పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్టు ఒట్నీల్ బార్ట్‌మన్ ను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో కేప్ టౌన్ వేదికగా జరిగిన సోమవారం నాటి వేలంలో మిగిలిన ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ కోసం సన్రైజర్స్.. ఎంఐ కేప్ టౌన్(ముంబై ఇండియన్స్)తో పోటీ పడి మరీ 9.2 మిలియన్ సౌతాఫ్రికా ర్యాండ్లు (భారత కరెన్సీలో సుమారు 4.1 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది.
If you haven’t found a reason to be eXXcited, we invite you to watch the teams battle it out to get the services of 22 year old Tristan Stubbs.#SA20Auction #SA20 pic.twitter.com/Q3yrRP3Qp4
— SA20_League (@SA20_League) September 19, 2022
ఈ యువ క్రికెటర్ ఎస్ఆర్ హెచ్ సొంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించగానే కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె మురిసిపోయిన తీరు అభిమానులకు ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఐపీఎల్-2022లో ట్రిస్టన్ స్టబ్స్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
ట్రిస్టన్ స్టబ్స్, సారెల్ ఎర్వీ, జోర్డాన్ కాక్స్ (ఇంగ్లాండ్), ఆడమ్ రోసింగ్టన్ (ఇంగ్లాండ్), మార్క్వెస్ అకెర్మాన్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, సిసాండా మగాలా, బ్రైడన్ కార్సే (ఇంగ్లాండ్), జెజె స్మట్స్, టామ్ అబెల్ (ఇంగ్లాండ్), అయా గ్కమనే, రోయోఫ్ వాన్ డెర్ మెర్వే, జేమ్స్ ఫుల్లర్ (ఇంగ్లాండ్), మాసన్ క్రేన్ (ఇంగ్లాండ్), జునైద్ దావూద్, ఒట్నీల్ బార్ట్‌మన్.
The 2023 #SEC Collection 🎵
We’re on track for a promising season 🧡#OrangeArmy #SunrisersEasternCape #SA20 pic.twitter.com/6TwfTpPaZE
— Sunrisers Eastern Cape (@SunrisersEC) September 20, 2022
సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్‌రైజర్స్ జట్టుపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.