టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పు కారణంగానే ఈ రోజు అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలిరోజు.. ఆసిస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. భారత్-ఆసిస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా కీలకమైన నాలుగో టెస్ట్ జరుగుతోంది. ఈ టెస్ట్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవడంతో పాటుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లోకి దర్జాగా అడుగుపెట్టాలని భావిస్తోంది భారత్. అయితే తొలిరోజు మాత్రం పూర్తి ఆధిపత్యం చెలాయించింది ఆసిస్. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఆసిస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(104*) సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ రోహిత్ చేసిన తప్పు కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటున్నాడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్.
భారత్-ఆసిస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు ఆసిస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత మూడు మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శన చూపెట్టిన టీమిండియా బౌలర్లు.. తొలిరోజు ఏ మాత్రం ఆసిస్ బ్యాటర్లపై ప్రభావాన్ని చూపించలేకపోయారు. అయితే భారత్ పరిస్థితి ఇలా ఉండటానికి ప్రధాన కారణం మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడమే అని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. రెండో టెస్ట్ తర్వాత మూడో టస్ట్ కు 8 రోజుల విశ్రాంతి దొరికిందని, అయినా వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ పేరిట షమీని మూడో టెస్ట్ నుంచి కూడా తప్పించారని గవాస్కర్ మండిపడ్డాడు. ఇదే ఇప్పడు అహ్మదాబాద్ టెస్ట్ లో భారత్ పై తీవ్ర ప్రభావం చూపిందని గవాస్కర్ అన్నాడు.
ఈ క్రమంలోనే సిరాజ్ స్థానంలో కొన్ని రోజుల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన షమీ.. రిథమ్ అందుకోవడానికి టైమ్ తీసుకున్నాడు. ఇక అతడు తన తొలి స్పెల్ ను చాలా అసౌకర్యంగా పూర్తి చేశాడు. ఇక షమీకి రెస్ట్ ఇవ్వడం తెలివైన నిర్ణయం కాదని రోహిత్ ని విమర్శించాడు గవాస్కర్. ఇక తొలిరోజు ఆటలో ఆసిస్ బ్యాటర్లు నర్వస్ గా కనిపించినప్పటికీ షమీ రిథమ్ లో బౌలింగ్ చేయలేకపోయాడు అని పేర్కొన్నాడు.ఇక జిమ్ లో ఎంత వర్కౌట్ చేసినా కండరాలు బలంగా మారవని, మ్యాచ్ ల్లో బౌలింగ్ చేస్తుంటేనే కండరాలు బలంగా మారుతాయని ఈ సందర్భంగా గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి షమీకి రెస్ట్ ఇవ్వడం అనేది రోహిత్ చేసిన తప్పు అన్న గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.