ఫోర్లు.. సిక్సులతో సాగే అభిమానుల కేరింతలు ఒకవైపు.. బెట్టింగ్ రాయుళ్ల పందాల జోరు మరోవైపు. అర్థమయ్యింది కదూ.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ధి రోజులే మిగిలి వున్నాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు ఆనందాన్ని పంచె వార్త ఒకటొచ్చింది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ధి రోజులే మిగిలి వున్నాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాలు షురూ కాగా, కొందరు ఆటగాళ్లు ఆయా ప్రాంచైజీల గూటికి చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు అదిరిపోయే వార్త అందుతోంది. మునుపటి గెలుపు-ఓటములను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్ లో ధరించబోయే జెర్సీలో సన్‌రైజర్స్ యాజమాన్యం కొన్ని మార్పులు చేసింది.
ఐపీఎల్ టోర్నీలో ఎస్‌ఆర్‌హెచ్ ప్రస్థానం 2013 నుంచి ప్రారంభమైనా.. ఇప్పటివరకు గెలిచిన టైటిళ్ల సంఖ్య.. ఒకటి. 2016లో టైటిల్ విజేతగా, 2018లో రన్నరప్‌గా నిలవడం తప్ప పెద్ద చెప్పుకోదగ్గ గణాంకాలు ఏమీ లేవు. చూడడానికి జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నా.. మైదానంలోకి అడుగుపెట్టాక.. అంతా తుస్. వాస్తవంగా చెప్పాలంటే.. వీరి ఆట తీరు తెలుగు అభిమానులు ‘ఇది మా జట్టు కాదు.. నేను కోహ్లీ ఫ్యాన్.. నాది ఆర్‌సీబి..‘ అని కొందరు, ‘నేను రోహిత్ అభిమానిని.. నాది ముంబై..‘ అని మరికొందరు అంటున్నారంటే నమ్మండి. ఈ బేదజాలాలు తొలగించాడనికి సన్‌రైజర్స్ యాజమాన్యం ఈసారి పకడ్భంధీ ప్లాన్ తో ఎంట్రీ ఇస్తోంది. మునుపటి గెలుపు-ఓటములను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్ లో ధరించబోయే జెర్సీలో కొన్ని మార్పులు చేసింది.
Looks Cool ..Look Fun.. Look Fiery …! 💥💥
Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍
#SRH | #OrangeArmy𓅃 | #OrangeArmy | #IPL2023 | #OrangeFireIdhi pic.twitter.com/6wCaQ3c3fc
— Orange Army (@OrangeArmyIPL) March 16, 2023
ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡
Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi
— SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023
గత సీజన్ల జెర్సీలతో పోలిస్తే పెద్ద మార్పులు లేనప్పటికీ.. ఈసారి సరి కొత్తగా కనిపిస్తోంది. ఇంతకుముందు టీషర్ట్ హాండ్స్ పూర్తి నలుపు రంగులో ఉండగా, ఈసారి దానిని బ్లాక్ రంగులోనే ఉంచి లైన్స్ రూపంలోకి మార్చారు. అలాగే, ఆరంజ్ కలర్ లో ఉన్న ప్యాంటుని తీసేసి పూర్తి బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. నిజానికి ఆరంజ్ ఆర్మీ కాస్తా బ్లాక్ ఆర్మీ అయ్యిందంటే నమ్మండి. హా.. జెర్సీలో మార్పులు చేసినంత మాత్రాన..ఆట మారుద్దా..? టైటిల్ వస్తదా..? అనుకోకండి. రావచ్చేమో.. ఐడెన్ మార్కరమ్ సారధ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్ సేన ఈసారి బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే అతని సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలవడం జట్టుకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది.
Perth Scorchers BBL 2023 Winners Orange Team.
Sunrisers Eastern Cape SA20 2023 Winners Orange Team.
Hope @SunRisers will do the Same in IPL 2023 🤗🧡 #SRH #SEC pic.twitter.com/1oXsRNh6sX— Sunrisers Orange Army (@SunrisersOArmy) February 12, 2023
దీనికి తోడు ఈ ఏడాది మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ రాకతో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. అలాగే, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ జోడికి.. నటరాజన్ కలవనుండటం ఒక మంచి పరిణామం అయితే, అఫ్ఘాన్ బౌలర్ ఫజాల్హా ఫారూఖీ తోడవ్వడం బౌలింగ్ లైనప్ ను ఒక ఎత్తుకు చేర్చింది. చూడడానికి జట్టు సమతూకంగా ఉండటం టైటిల్ ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ విజయావకాశాలపై, కొత్త జెర్సీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ee sari IPL lo kuda cup lepude
🧡 🧡#SRH #sunrisershyderabad pic.twitter.com/RatyQEBzu3
— mahesh kohli 🇮🇳*️⃣🪓 (@maheshcool2605) March 16, 2023