భారత స్టార్ స్ప్రింటర్, ఆసియా క్రీడల విజేత ద్యుతీ చంద్ డోపింగ్ టెస్ట్ లో దొరికిపోయింది. ద్యుతీకి నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా ) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటనలో తెలిపింది. ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 అండ్రయిన్, ఓ డెఫినిలాండ్రైన్, సార్స్మ్, మోటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయని వాడా తెలిపింది. ఈ స్టెరాయిడ్లు శక్తి, సామర్థ్యాలు ఇస్తూ, పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయని తెలిపింది.
ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేషన్ లో ఉందని, శాంపిల్ ఏ టెస్టులో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని, శాంపిల్ బి టెస్టు పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని వాడా పేర్కొంది. వాడా ఆదేశించిన పద్ధతిలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఈ పరీక్షలు చేపట్టింది. నాడా ఆదేశాను సారం ఏడాదిలో నాలుగు సార్లు డోప్ టెస్టు కోసం శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా ఆమె సమర్పించిన యూరైన్ శాంపిల్స్ లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నాయని తేలింది.
ద్యుతీ చంద్ 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాలు గెలించింది. 2013, 2017, 2019 ఆసియా క్రీడల్లో కూడా ఆమె కాంస్య పతకాలు సాధించింది. 2019 యునివర్సైడ్ చాంపియన్ షిప్ లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్ గా నిలిచింది. టోక్యో ఒలంపిక్స్ 2020 పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో ఏడో స్థానంలో నిలిచి క్వాలిఫైయర్స్ రౌండ్స్ నుండే తప్పుకుంది.
Asian Games medallist Dutee Chand tests positive in “Adverse Analytical Finding, suspended for using a prohibited substance.
Her ‘A’ sample has tested positive. The next step will likely be an appeal by the sprinter and a test of her ‘B’ sample.
(File photo) pic.twitter.com/PIQChA6Vzv
— ANI (@ANI) January 18, 2023