తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నాడు. టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరగనుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు ముందే అక్కడికి చేరుకుంది. టీమ్‌తో పాటు తిరువనంతపురం చేరుకున్న కేశవ్ సాంప్రదాయపద్దంగా ధోతి ధరించి స్వామివారిని దర్శించుకుని, దర్శన అనంతరం ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు. నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై మాతా ది అని క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం కేశవ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
1990 ఫిబ్రవరి 7న డర్బన్‌లో జన్మించిన కేశవ్ మహారాజ్ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. కేశవ్ పూర్వీకులు ఒకప్పుడు భారతదేశంలోనే నివసించే వారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి 1874లో దక్షిణాఫ్రికాకు వలసవెళ్లారు. అక్కడే పూర్తిగా స్థిరపడిపోయారు. దక్షిణాఫ్రికాలో స్థిర పడినా మన దేశ సాంప్రదాయాలను కేశవ్ వదులుకోలేదు. పండుగల సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తుంటాడు. కాగా.. కేశవ్ తాత, తండ్రి కూడా క్రికెటర్లే. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో రాణించారు. వారి బాటలోనే కేశవ్ కూడా క్రికెట్‌నే కెరీర్‌గా మలుచుకుని సౌతాఫ్రికా జాతీయ జట్టులో చోటు సాధించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పినర్‌గా రాణిస్తున్నాడు.
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20లు ఆడనుంది. తొలి మ్యాచ్ బుధవారం తిరువనంతపురంలో ప్రారంభం కానుంది. రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 2న గౌహఠీలో, మూడో మ్యాచ్ అక్టోబర్ 4న ఇండోర్‌లో జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవలం చేసుకున్న టీమిండియా. అదే ఉత్సహంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు సిద్ధమైంది. సౌతాఫ్రికాపై కూడా విజయం సాధించి.. టీ20 వరల్డ్ కప్ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు.
Keshav Maharaj wishes everyone a Happy Navratri. pic.twitter.com/c7JvRQYYCs
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2022
ఇది కూడా చదవండి: మన్కడింగ్ వివాదానికి పుల్‌స్టాప్! నిజం ఒప్పుకున్న ఇంగ్లండ్ బ్యాటర్