తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నాడు. టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరగనుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు ముందే అక్కడికి చేరుకుంది. టీమ్‌తో పాటు తిరువనంతపురం చేరుకున్న కేశవ్ సాంప్రదాయపద్దంగా ధోతి ధరించి స్వామివారిని దర్శించుకుని, దర్శన అనంతరం ఫొటోలను తన […]