విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకుంటున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఏదో ఒక విషయంతో వార్తలో ఉంటున్నాడు. టీ20 కెప్టెన్సీ వదులుకున్న తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్‌గా తప్పించడం, తాజాగా టెస్టు కెప్టెన్సీని కోహ్లీ వదులుకోవడంతో అసలు కోహ్లీకి, బీసీసీఐ మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో మరో సంచలన విషయం బయటికి వచ్చింది. విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు.. దానికోసం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అనుకోవడం జరిగినట్లు సమాచారం.
వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించన తర్వాత.. ఆ విషయంపై స్పందించిన గంగూలీ.. విరాట్‌ను టీ20 కెప్టెన్‌గా తప్పుకోవద్దని కోరినట్లు పేర్కొన్నాడు. అయినా కూడా కోహ్లీ మాట వినలేదని, అందుకే పరిమిత ఓవర్లకు ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో రోహిత్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించాడు. అనంతరం సౌత్ ఆఫ్రికాతో సిరీస్‌కు ముందు వన్డే కెప్టెన్సీ విషయంపై స్పందించిన కోహ్లీ.. టీ20 కెప్టెన్‌గా తనను తప్పుకోవద్దని ఎవరూ కోరలేదని, అయినా కెప్టెన్‌గా తప్పుకోవడాన్ని ఎవరూ ఆపలేరని అన్నాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలోనూ తనను సరిగా సంప్రదించలేదని బాంబు పేల్చాడు. దీంతో బీసీసీఐ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.
సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందే కోహ్లీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కానీ.. మిగతా బోర్డు సభ్యులు గంగూలీని సముదాయించి ఆ నోటీసులను ఆపినట్లు తెలుస్తుంది. టెస్టు సిరీస్ తర్వాత కోహ్లీపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ భావించినట్లు, కానీ కోహ్లీనే కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అంతా సద్దుమణిగినట్లు సమాచారం. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీని కాదని గంగూలీకే మద్దతు తెలిపిన సచిన్