విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి మాజీ బీసీసీఐ ఛైర్మన్ గంగూలీ కావాలనే తప్పించాడనే వివాదం చెలరేగింది. దానికి బలం చేకూరుస్తూ.. తాజాగా చేతన్ శర్మపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం బయటికొచ్చింది. అయితే.. గంగూలీ చేసిన పని కోహ్లీకి మంచే చేసింది తప్పా.. నష్ట చేయలేదని కొంతమంది అంటున్నారు.
చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మపై స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంతో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీకి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య వివాదం నడిచిన విషయం బయటపడింది. కెప్టెన్సీ విషయంలో తనను అవమానించాడని గంగూలీపై కోహ్లీ అబద్ధాలు చెప్పాడని, అలాగే కోహ్లీ అంటే అయిష్టంతోనే రోహిత్ శర్మను గంగూలీ కెప్టెన్ చేశాడని విషయాలను చేతన్ శర్మ వెల్లడించాడు. గంగూలీని విరాట్ కోహ్లీ శత్రువులా భావించాడని కూడా పేర్కొన్నాడు. తన ఇష్ట ప్రకారం కాకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించాడని దాదాపై కోహ్లీ కోపం పెంచుకున్నట్లు ఆయన వ్యాఖ్యల్లోని సారాంశం. అయితే.. విరాట్ కోహ్లీ విషయంలో సౌరవ్ గంగూలీ అంతా మంచే చేశాడంటూ.. కోహ్లీ కెరీర్‌లో దాదా విలన్ కాదని, ఒక రకంగా చెప్పాలంటే దాదా కారణంగా కోహ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటూ కొంతమంది క్రికెట్ నిపుణులు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. మరి కోహ్లీ విషయంలో దాదా చేసిన మంచి ఏంటో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా రెండు వరల్డ్ కప్‌లో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. జట్టును విజయవంతంగా నడిపించాడు. తన అగ్రెసివ్ పంథాతో టెస్టుల్లో భారత్‌ను తిరుగులేని టీమ్‌గా నిలిపాడు. అయితే.. కొంతకాలం తర్వాత కెప్టెన్‌గా బాగానే సక్సెస్ అవుతున్నా.. ఒక ఆటగాడిగా కోహ్లీలో మునుపటి ఫైర్ తగ్గింది. ముఖ్యంగా 2019-2021 మధ్య కోహ్లీ ఫామ్‌లో లేనట్లు కనిపించాడు. చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. అతని నుంచి సెంచరీ మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీ20 కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా చేశాడు. తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ భారాన్ని కాస్త తగ్గించుకునేందుకే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. కానీ.. వన్డే, టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నట్లు ప్రకటించాడు. కానీ.. అప్పటి బీసీసీఐ ఛైర్మన్ గంగూలీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి ఆ బాధ్యతలను రోహిత్‌కు అప్పగించాడు.
కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించే సమయంలో.. గంగూలీ మాట్లాడుతూ.. కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తాము కోరినట్లే పేర్కొన్నాడు. కానీ.. కోహ్లీ మాత్రం తనను అలా ఎవరూ అడగలేదని తెలిపి దాదాను ఇరుకున పెట్టాడు. అయితే.. కోహ్లీ టీ20 కెప్టెన్సీ రాజీనామా నిర్ణయానికి ముందు ఉంటే మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉండాలని, లేదా.. పరిమిత ఓవర్ల వరకైనా కెప్టెన్‌గా ఉండాలని దాదా సూచించినట్లు సమాచారం. కానీ.. కోహ్లీ భిన్నంగా వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ ఫామ్ కోల్పోయి స్ట్రగుల్ అవుతున్న సమయంలోనూ.. కెప్టెన్సీ విషయంలో ఒక సారి ఆలోచించాలని దాదా కోహ్లీతో అన్నట్లు సమాచారం. కానీ.. కోహ్లీ మాత్రం దాదా సూచనను పట్టించుకోకుండా.. వన్డే, టెస్టు కెప్టెన్సీ వైపే ముగ్గుచూపాడు. ఇలా కోహ్లీ మొండి పట్టుదలకు విసిగిపోయిన దాదా.. విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా భవిష్యత్తు కోసం వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి టీ20, వన్డే బాధ్యతను రోహిత్‌కు, టెస్టు క్రికెట్ బాధ్యతను కోహ్లీకి అప్పగించాడు. వన్డే కెప్టెన్సీ పోయిందన్న బాధతో కొన్ని రోజులకు కోహ్లీ టెస్టు కెప్టెన్సీని కూడా వదిలేశాడు.
ఇలా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని పూర్తిగా వదిలేసిన తర్వాత కూడా కోహ్లీ కొన్ని రోజుల పాటు ఫేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. కానీ.. ఆసియా కప్ 2022కు ముందు పలు సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్‌లో ఆడి మళ్లీ తన ఫామ్‌ను అందుకున్నాడు. కెప్టెన్సీ భారం దించుకున్న తర్వాత.. ఆసియా కప్ 2022లో అఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో కోహ్లీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. టీ20 వరల్డ్ కప్ 2022లోనూ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చి.. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ అతను ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్ అయితే.. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్. ఆ తర్వాత కోహ్లీ మరో మూడు సెంచరీలు కూడా బాదేశాడు.
మూడేళ్ల కాలంలో ఒక్క సెంచరీ కూడా చేయని కోహ్లీ రెండు మూడు నెలల్లోనే నాలుగు సెంచరీలు బాదేశాడు. అయితే.. కోహ్లీ మరో సారి గొడకు కొట్టిన బంతిలా ఫామ్‌లోకి రావడానికి కారణం.. గంగూలీనే. కోహ్లీపై పెరుగుతున్న కెప్టెన్సీ ఒత్తిడిని గమనించిన దాదా.. వన్డే కెప్టెన్సీ విషయంలో ఒక సారి ఆలోచించాలని సూచించాడు. కానీ.. కోహ్లీ వినకపోవడంతో.. తప్పని పరిస్థితుల్లో అతనే తప్పించాడు. దాదా కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించకుండా ఉంటే.. ఇప్పటికీ వన్డే, టెస్టు కెప్టెన్‌గా కోహ్లీనే కొనసాగేవాడు. అదే కెప్టెన్సీ ఒత్తిడితో ఫామ్ అందుకోలేక.. కెరీర్‌నే ప్రమాదంలో వేసుకునే వాడు. కానీ.. దాదా తీసుకున్న నిర్ణయంతో అయిష్టంగా అయినా సరే కోహ్లీపై కెప్టెన్సీ భారం లేకుండా పోయింది. ఇండియన్ టీమ్ వింటేజ్ కోహ్లీని అందించింది. అందుకే.. దాదా కోహ్లీకి మంచే చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chetan Sharma opens up about the Virat Kohli-Sourav Ganguly captaincy controversy in an exclusive sting operation by Zee News 👀🇮🇳#India #TeamIndia #CricketTwitter pic.twitter.com/N9LrR9C6b6
— Sportskeeda (@Sportskeeda) February 15, 2023
The explosive Chetan Sharma Sting which has blown away the entire Indian cricketing fraternity!
Chairman of Selectors spills beans on the Virat Kohli-Sourav Ganguly stir and much more!#ChetanSharmaSting pic.twitter.com/ziLUwbOs1p— OneCricket (@OneCricketApp) February 15, 2023