డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని సంపాదించిన కమ్మిన్స్ సేన రెండో ఇన్నింగ్స్ లో కాస్త తడబడినా.. ఆధిక్యాన్ని మాత్రం 296 పరుగులకి పెంచుకుంది. ఇలాంటి పరిస్థితిలో భారత్ గెలవడం కష్టం అనుకుంటున్నా తరుణంలో గంగూలీ భారత్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అంతే కాదు కోహ్లీని ప్రశంసించడం ఇక్కడ హైలెట్ గా మారింది
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ సారధి విరాట్ కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ మధ్య సఖ్యత లేదనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ ప్రత్యక్షంగా ఎప్పుడూ విమర్శలు చేసుకోపోయినా.. కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుండి తప్పించడంలో గంగూలీదే ప్రధాన పాత్ర అని అప్పట్లో వార్తలొచ్చాయి. కోహ్లీ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా తెలియజేశాడు. అంతేకాదు ఇటీవలే జరిగిన ఐపీఎల్ లో మ్యాచ్ అనంతరం ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వీరి మధ్య వివాదాలు ఉన్నాయనే దానికి బలం చేకూరింది. అయితే ఇదిలా ఉండగా.. తాజాగా కోహ్లీని ప్రశంసిస్తూ గంగూలీ మాట్లాడడం కాస్త కొత్తగా అనిపించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ వెనకపడినా గెలవచ్చని చెప్పుకొచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని సంపాదించిన కమ్మిన్స్ సేన రెండో ఇన్నింగ్స్ లో కాస్త తడబడినా.. ఆధిక్యాన్ని మాత్రం 296 పరుగులకి పెంచుకుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్లకు 123 పరుగులు చేసింది. గ్రీజ్ లో లబుషేన్(41) గ్రీన్ (7) ఉన్నారు. నాలుగో రోజు ఆస్ట్రేలియా మరో 100 పరుగులు జోడించిన 400 పరుగుల భారీ టార్గెట్ అంటే భారత్ కి చాలా కష్టం అయిపోతుంది. దీంతో భారత్ నాలుగో రోజు ఎలా ఆడుతుందో అనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ సమయంలో గంగూలీ భారత్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
గంగూలి మాట్లాడుతూ ” ఆస్ట్రేలియా కనుక 360 లేదా 370 టార్గెట్ ఉంచినా కూడా భారత్ గెలిచే అవకాశం ఉందని దాదా అభిప్రాయపడ్డాడు. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. ప్రపంచంలోనే బెస్ట్ ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కనుక రాణిస్తే అది పెద్ద టార్గెట్ కాదని తెలిపాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ రాణించలేదన్న సంగతి తెలిసిందే.అయితే రెండో ఇన్నింగ్స్‌లో కూడా అలాగే జరుగుతుందని చెప్పలేం. మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లు కోహ్లీ తడబడకుండా 20 పరుగులు చేశాడంటే క్రీజులో కుదురుకున్నట్లే. ఆ తర్వాత అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అదే విషయాన్ని గంగూలీ కూడా తెలిపాడు. ఒకవేళ భారత్ 360 లేదా 370 టార్గెట్ ఛేజ్ చేయాల్సి వస్తే.. భారత్ కచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ల దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ ఛేజర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అలాగే చాలా మంది క్లాస్ ప్లేయర్లున్నారు. కాబట్టి చివరి రెండ్రోజుల్లో ఏమైనా జరగొచ్చు’ అని గంగూలీ పేర్కొన్నాడు. మొత్తానికి గంగూలీ కోహ్లీ గురించి ఇలా పాజిటీవ్ గా స్పందించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపపండి.