ఈ ఆధునిక యుగంలో సోషల్ మీడియా.. సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా విషయం తెలిస్తే చాలు అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అయితే ఈ సోషల్ మీడియా వల్ల చాలా వరకు అసత్యాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని కొందరి వాదన. ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా ఫాలోవర్స్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా లోకంలోనే కాక.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలు కింగ్ కోహ్లీని ఉద్దేశించే.. గంభీర్ చేశాడని కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
గౌతమ్ గంభీర్.. టీమిండియా 2011 ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టులో సభ్యూడు కూడా. ఫైనల్ మ్యాచ్ లో 91 పరుగులు చేసి విజయంలో కీలక పాత్రవహించాడు. అయినప్పటికీ అతడికి అంత పేరు రాలేదు. అయితే విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ కు గతంలో కొన్ని గొడవలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అప్పటినుంచి వారిద్దరి మధ్య సఖ్యత అంతగా కుదరడం లేదు. ఈ క్రమంలోనే కింగ్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. విరాట్ ను ట్వీటర్ లో 50 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఇన్ స్టా లో అయితే అతడి ఫాలోయింగ్ మామ్ములుగా లేదు. విరాట్ ఫాలోవర్స్ ని చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
ఇక కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ లో 214మిలియన్ల పైచిలుకు ఫాలోవర్స్ తో వరల్డ్ లోనే మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే గంభీర్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా విరాట్ ని ఉద్దేశించినవే అంటూ క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. గంభీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడుతూ..”మెుత్తం భారతదేశ వ్యవస్థలోనే సోషల్ మీడియా ఫాలోవర్స్ అనేది ఓ పచ్చి అబద్దం. అసలు మీరు ఎంత మందిని జడ్జ్ చేయగలరు.. మీ ఫాలోవర్స్ ని. అదీ కాక మీ ఫాలోవర్స్ ని బట్టే మిమ్మల్ని జడ్జ్ చేయాలా? ఫాలోవర్స్ పెరిగినంత మాత్రానా గొప్ప విషయం కాదని” గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలు విన్నాక ఇది కచ్చితంగా కోహ్లీని ఉద్దేశించి అన్నవే అని కొందరు నెటిజన్స్ అంటున్నారు. గత కొన్ని నెలలుగా కోహ్లీ ఫామ్ పై అవకాశం దొరికినప్పుడల్లా గంభీర్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. మరి గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా ఫాలోవర్స్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.