స్మృతి మంధాన.. ఆటలోనూ, అందంలోనూ తనకు తానే సాటి. 26 వయసున్న ఈ మద్దగుమ్మ ఇంకా బ్యాచిలర్. అలా అని ఊహల్లోకి వెళ్లిపోకండి.. అది అందని ద్రాక్షే. ఎంత అందంగా ఉన్నా క్రికెటర్ కనుక ఎప్పుడు పెళ్లిచేసుకుంటుందో చెప్పలేం.. 40 ఏళ్ళైనా ఆశ్చర్యపోనవసరం లేదు.. మీరు ఉహల్లోకి వెళ్ళిపోయి దేవదాసుల అవ్వడం కంటే.. అందాన్ని తిలకించి ఆనందంతో కేరింతలు కొట్టడం మిన్న.
‘స్మృతి శ్రీనివాస్ మంధాన‘ ఆటతోనే కాదు.. అందంతోనూ అభిమానుల మనసు కొల్లగొట్టిన ఏకైక ముద్దుగుమ్మ. 5 అడుగుల 4 అంగుళాల పొడవు, చూడడానికి నాజుగ్గా కనిపించే ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పైగా బ్యాచిలర్. అందుకే స్మృతిని ‘నేషనల్ కృష్’ అని పిలుస్తుంటారు. కొందరు అభిమానులు మంధానను చూసేందుకే స్టేడియంకు వస్తారంటే నమ్మొచ్చు. ఈ బామ్మ ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు వచ్చే ఉత్సహం తక్కువే కానీ.. ఒక్కసారి హెల్మెట్ తీసి తల అటూ.. ఇటూ.. ఊపిందా ఊలలు, కేకలుతో స్టేడియం దద్ధరిల్లి పోవాల్సిందే. తాజాగా, ఈ ముద్దుగుమ్మ డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టింది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో వేలంలోకి వచ్చిన తొలిక్రీడాకారిణిగా అరుదైన ఘనత సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా రూ. 3.40 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.
ముంబై వేదికగా ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో మహిళా క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. నాణ్యమైన ప్లేయర్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన భారీ ధర పలికింది. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మంధానను దక్కించుకోవడానికి బెంగళూరు, ముంబై ప్రాంచైజీలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 3.4 కోట్లకు స్మృతిని దక్కించుకుంది.
The first ever pick in the history of the WPL: Smriti Mandhana by RCB 👏https://t.co/58aRGIGYJD #WPLAuction pic.twitter.com/AZcwlRv51h
— ESPNcricinfo (@ESPNcricinfo) February 13, 2023
ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడటమే స్మృతి స్టయిల్. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగే మంధాన, మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించగల సమర్థురాలు. అదే తనకు కోట్లు కురిపించింది. ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న స్మృతికి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన స్మృతి మంధాన ఇప్పటివరకు112 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడగా, 123 స్ట్రైక్ రేట్ తో 2651 పరుగులు చేసింది. ఇందులో 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దేశానికే కాకుండా మంధాన ‘మహిళల బిగ్ బాష్ లీగ్’, ‘ది హండ్రెడ్ లీగ్’ వంటి టోర్నీలో ఆడుతోంది.
Yet another lovely video – the celebration is simply incredible.
Renuka Singh Thakur joins Smriti Mandhana in RCB. pic.twitter.com/63OteaQwKC
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2023
Virat Kohli and Smriti Mandhana for RCB.
King and Queen of World Cricket. pic.twitter.com/a3G0W0h9VL
— CricketMAN2 (@ImTanujSingh) February 13, 2023