యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్.. కొన్నిరోజుల ముందు ఈ పేరు గట్టిగా వినిపించింది. అందుకు కారణం వన్డేల్లో డబుల్ సెంచరీ. చాలా చిన్న ఏజ్ లోనే ఈ ఫీట్ సాధించేసరికి అందరూ మనోడి గురించి తెగ మాట్లాడుకున్నారు. మనోడి బ్యాటింగ్ పై డౌట్స్ ఉన్నవాళ్లందరికీ తన ద్విశతకంతో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అది జరిగి కొన్నిరోజులైనా కాలేదు. అప్పుడే టీ20ల్లో తొలి శతకం బాదేశాడు. క్లాస్ గా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు కానీ అంతే స్మూత్ గా సెంచరీ చేసేశాడు. అక్కడితో ఆగిపోకుండా పలు రికార్డులు కూడా తన పేరిట నమోదు చేశాడు. ప్రస్తుతం అవి హాట్ టాపిక్ గా మారాయి.
ఇక విషయానికొస్తే.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20ల్లో టాస్ గెలిచిన భారత్, బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 234/4 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో గిల్ సెంచరీ చాలా కీలకం ఎందుకంటే స్టార్టింగ్ లో కాస్త నెమ్మదిగా ఆడిన గిల్.. తర్వాత దూకుడు చూపించాడు. దీంతో 54 బంతుల్లోనే శతకం పూర్తయింది. ఇక నాటౌట్ గానే ఇన్నింగ్స్ ముగించిన గిల్.. 63 బంతుల్లో అజేయంగా 126 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. కోహ్లీ, రోహిత్ రికార్డులను అధిగమించాడు.
ఇక ఈ రికార్డు గురించి పక్కనబెడితే.. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు సాధించాడు. గతంలో కోహ్లీ, రోహిత్, రైనా, కేఎల్ రాహుల్ చేసినప్పటికీ వాళ్లందరికీ చిన్న వయసులోనే అంటే 23 ఏళ్ల 146 రోజుల్లోనే గిల్ ఈ మార్క్ ని అందుకున్నాడు. దీన్ని సాధించిన ఒకే ఒక్కడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక గిల్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. 2023 కాస్త గిల్ నామ సంవత్సరంగా మారిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గిల్ సెంచరీలతో రికార్డులు క్రియేట్ చేయడాన్ని మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
#gill century against new zealand.@ShubmanGill #sachintendulkar #bcci pic.twitter.com/VytGdNK4ez
— Nidhin Babukuttan (@NidhinBabukuttn) February 1, 2023