బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ ఓడిపోయిన భారత్.. టెస్ట్ సిరీస్ గెలవడం ద్వారా దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రారంభం అయిన తొలి మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించడంతో బంగ్లా పై భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీమిండియా ఓపెనర్ కమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరచగా.. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ శతకంతో చెలరేగాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 110 పరుగులు చేసి హసన్ మిర్జా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గిల్ కు టెస్ట్ క్రికెట్ లో ఇదే తొలి శతకం కావడం విశేషం.
టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెలరేగడంతో బంగ్లాదేశ్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ 5 వికెట్లతో బంగ్లా నడ్డివిరిచాడు. సిరాజ్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో భారత్ కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బంగ్లాను ఫాలో ఆన్ ఆడిస్తారని అందరు అనుకున్నారు. కానీ అలా చేయలేదు. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు ఆశించిన శుభారంభం దక్కలేదు. 70 పరుగుల వద్ద టీమిండియా తన తొలి వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ రాహుల్ 62 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన పుజారాతో జతకట్టిన శుభ్ మన్ గిల్ స్కోర్ బోర్డును నెమ్మదిగా పరిగెత్తించాడు.
A breakthrough year for Shubman Gill in international cricket.
📸: Sony LIV pic.twitter.com/Qc62Sgt6Od
— CricTracker (@Cricketracker) December 16, 2022
వీరిద్దరు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే ఓపెనర్ గిల్ తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 110 పరుగులు చేసి మెహదీ హసన్ మిర్జా బౌలింగ్ లో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ మహ్మదుల్ హసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో పుజారా 65 పరుగులతో, కోహ్లీ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత్ కు 461 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేయాగా, బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Shubman Gill departs after scoring a brilliant century 👏@ShubmanGill | #BANvIND pic.twitter.com/Jqu6Gey4Is
— CricTracker (@Cricketracker) December 16, 2022