న్యూజిలాండ్ తో జరుగుతు నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. కివీస్ బౌలర్లను చితక్కొడుతూ.. భారీ స్కోర్ నమోదు చేశారు. ముఖ్యంగా డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 54 బంతుల్లో సెంచరీతో కదం తొక్కాడు గిల్. తన ఫామ్ ను కొనసాగిస్తూ.. టీమిండియాకు భారీ స్కోర్ ను అందించాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి నిరాశ పరచగా.. రాహుల్ త్రిపాఠితో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు గిల్. ఈ క్రమంలోనే తన టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు గిల్.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు కివీస్ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్. ఇన్నింగ్స్ 1.2 బంతికే ఓపెనర్ ఇషాన్ కిషన్ ను పెవిలియన్ కు పంపి భారత్ పై ఒత్తిడిని తెచ్చాడు. అయితే ఈ ఒత్తిడిని తన ముందు పనికి రాదన్నట్లుగా చెలరేగిపోయాడు వన్డే డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గి ల్. కివీస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ.. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 63 బంతులు ఎదుర్కొన్న గిల్ 7 సిక్స్ లు 12 ఫోర్లతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గిల్ కు తోడు రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 44 పరుగులతో రాణించాడు. సూర్య కుమార్ (24), కెప్టెన్ పాండ్యా (30) పరుగులతో రాణించారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, సోథీ, మిచెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
The future of India – Shubman Gill.pic.twitter.com/RgYwqpHDfT
— Johns. (@CricCrazyJohns) February 1, 2023
Maiden T20I hundred for Shubman Gill, one of the great accelerations in T20I history.
Hundred from just 54 balls. pic.twitter.com/B5tJGa5fRS
— Johns. (@CricCrazyJohns) February 1, 2023