క్రీడా కారులకు, హీరోయిన్స్ కు మధ్య ప్రేమలు.. పెళ్లిళ్లు.. డేటింగ్ లు.. బ్రేకప్ లు సర్వ సాధారణమే. అయితే పలనా ఆటగాడు పలనా హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు ఇటీవలే వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు అనే వార్తలను మనం చాలానే వింటూ ఉంటాం. తాజాగా అలాంటి వార్తే ఒకటి క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ క్రికెటర్ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వార్తల్లోకి వెళితే..
శుభ్ మన్ గిల్.. ప్రస్తుతం అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో దుమ్ము రేపిన గిల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను అందుకున్నాడు. గిల్ వెస్టిండీస్ పర్యటనలో సైతం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకోవడం మనకు తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం గిల్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెలగ వైరల్ అవుతోంది. అదేంటంటే సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ తో బ్రేకప్ అయిందనే వార్త.
గత కొన్ని నెలలుగా సారా టెండుల్కర్ తో శుభ్ మన్ గిల్ డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు మనకు వినిపిస్తునే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై వారిద్దరు ఎప్పుడూ స్పందించ లేదు. తాజాగా వారిరువు ఇన్ స్టా లో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ వార్త తెలియడంతో అటూ క్రీడాభిమానులు, బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
తాజాగా గిల్ తన ఇన్ స్టా బ్లాగ్ లో ఓ పిక్ ను పోస్ట్ చేసి దాని కింద ఈ విధంగా రాసుకొచ్చాడు.”నేను నా ఫ్యూచర్ ను మాత్రమే చూస్తా.. నా గడిచిన కాలాన్ని కాదు” అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఈ కొటేషన్ చూసిన అభిమానులు వారిద్దరికి బ్రేకప్ జరిగింది అంటూ చర్చించుకుంటున్నారు. ఇక సారా మోడలింగ్ రంగంలోకి అడుపెట్టిన సంగతి తెలిసిందే. అదీ కాక ఓ టీవీ ప్రకటనలో కూడా సారా నటించింది.
దీంతో త్వరలోనే ఆమె బాలీవుడ్ లోకి రంగప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇంత జరుగుతున్నా సారా – గిల్ మాత్రం ఈ విషయంపై స్పందించ లేదు. వారు ఎందుకు అన్ ఫాలో చేసుకున్నారో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడిప్పుడే రాణిస్తున్న గిల్ భారత జట్టులో తన స్థాన్నాన్ని సుస్థిర పరచుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు అతడి పోస్టు చూస్తే తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shubman Gill-Sara Tendulkar unfollowed each other, what happened to the breakup? #ShubmanGill #SaraTendulkar #INDvPAK pic.twitter.com/AXgIgP4k66
— @Radhaannu (@Radhaannu3) August 24, 2022