యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పేరు చెప్పగానే.. అరేరే మంచి కుర్రాడే గానీ సరిగా టీంలో ఛాన్సులే రావట్లేదు అని చాలామంది అభిమానులు అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో మూడేళ్ల క్రితమే వన్డే, రెండేళ్ల క్రితం టెస్టు జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత నుంచి వస్తూపోతూ ఉన్నాడే తప్పించి స్థిరంగా ఉండలేకపోతున్నాడు. దీంతో మనోడిలో కసి బాగా పెరిగినట్లుంది. అందుకే ఐపీఎల్ లోనూ నిలకడైన ప్రదర్శన చేస్తూ వచ్చాడు. దీంతో త్వరలో జరగబోయే కివీస్, బంగ్లాదేశ్ సిరీస్ ల కోసం జట్టును ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వన్డేలు, టెస్టులతో పోలిస్తే టీ20ల్లో శుభ్ మన్ గిల్ కాస్త నెమ్మదిగానే ఆడతాడు. దీంతో మనోడిని టీ20 వరల్డ్ కప్ కోసం జట్టులోకి తీసుకోలేదు. కానీ ఈ టోర్నీ తర్వాత జరిగే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ ల కోసం మాత్రం గిల్ ని ఎంపిక చేశారు. ఇకపోతే 2019లో న్యూజిలాండ్ తో వన్డేతో గిల్.. అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై 2020 నాటి సిరీస్ తో టెస్టు జట్టులోకి వచ్చాడు. 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ.. భారత్ తరఫున టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
తాజాగా కివీస్, బంగ్లాదేశ్ సిరీస్ ల కోసం ఎంపిక చేసేసరికి ఫుల్ జోష్ లో ఉన్నాడో ఏమో.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చితక్కొట్టే బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ తరఫున ఆడిన గిల్.. కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో 49 బంతుల్లోనే సెంచరీ బాదాడు.. మొత్తంగా 55 బంతుల్లో 126 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్ లో గిల్ కి ఇదే ఫస్ట్ సెంచరీ కావడం విశేషం. దీన్ని చూసిన భారత అభిమానులు.. ఇలా సెలక్టయ్యాడు, అలా సెంచరీ బాదేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇదే జోష్ న్యూజిలాండ్ తో సిరీస్ లోనూ కొనసాగించాలని, అప్పుడు మన జట్టుకు తిరుగుండదని మాట్లాడుకుంటున్నారు.
1⃣2⃣6⃣ Runs
5⃣5⃣ Balls
1⃣1⃣ Fours
9⃣ Sixes@ShubmanGill set the stage on fire 🔥 🔥 & scored a sensational TON for Punjab in the #QF1 of the #SyedMushtaqAliT20. 💪 💪 #KARvPUN | @mastercardindiaWatch that stunning knock 🎥 🔽https://t.co/pG2FTfAqGC
— BCCI Domestic (@BCCIdomestic) November 1, 2022