మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం భారత్ లో పర్యటిస్తోంది న్యూజిలాండ్ జట్టు. హైదరాబాద్ వేదికగా బుధవారం తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్ వెన్నునొప్పి కారణంతో సిరీస్ మెుత్తానికి దూరం అయ్యాడు. అతడి స్థానంలో యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ ఆటగాడు దూరం కావడం టీమిండియాకు బిగ్ షాక్ గా క్రీడానిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గాయపడ్డ ప్లేయర్ ను నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మరికొన్ని గంటల్లో టీమిండియా జట్టు న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఇంతలోనే భారత టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. వెన్ను నొప్పి కారణంగా టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కివీస్ తో జరిగే వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు. గాయం పెద్దది కావడంతో అతడిని బెంగళూర్ లో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలిస్తున్న బీసీసీఐ పేర్కొంది. అక్కడ అతడికి మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపింది. అయితే గత కొంత కాలంగా శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుతో తలపడే ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే శ్రేయస్ స్థానంలో యంగ్ ప్లేయర్ రజత్ పాటీదార్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే గతంలో శ్రేయస్ అయ్యార్ భుజానికి గయం అయ్యి దాదాపుగా ఆరు నెలలు ఆటకు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఆ గాయమే తిరబెట్టి ఉండొచ్చు అని మేనేజ్ మెంట్ భావిస్తోంది. దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తోన్న పటీదార్ ఈ సిరీస్ లో ఎలా రాణిస్తాడో వేచిచూడాలి.
JUST IN: Shreyas Iyer will miss the ODI series against New Zealand due to a back injury
Rajat Patidar has been called-up as a replacement 🏏#INDvNZ pic.twitter.com/e9OlEOEs22
— ESPNcricinfo (@ESPNcricinfo) January 17, 2023