‘జెంటిల్ మ్యాన్ గేమ్’ గా పిలువబడే క్రికెట్‌లో వివాదాలు కొత్తేం కాదు. కానీ, వివాదాల కోసమే క్రికెట్ ఆడే ఆటగాళ్లు కొందరున్నారు. అందులో ముందుండే ఆటగాడు.. షోయబ్ అక్తర్. దీన్నే ‘స్లెడ్జింగ్’ అని కొందరు అంటుంటారు. దీనికి ఆద్యం పోసింది మాత్రం ఆస్ట్రేలియా జట్టే. అలాంటి ఆస్ట్రేలియా జట్టుకే, అక్తర్ తన పవరేంటో చూపించాడు. రాకాసి బౌన్సర్లు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడుతూ, ప్రత్యర్థి బ్యాటర్లను గుడ్లు ఉరిమి చూసేవాడు. అలాంటి ఘటన 2004లో ఒక చోటుచేజేసుకుంది.
అది 2004 డిసెంబర్. 3 టెస్టుల సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టులో దారుణ ఓటమి. ఎంతలా అంటే.. తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా జట్టు 381 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ రెండు ఇన్నింగ్సుల్లో(179 & 72) కలిపి కూడా 300 పరుగులు చేయలేకపోతోంది. మ్యాచ్ అనంతరం ఓటమిపై.. పాక్ డ్రెస్సింగ్ రూములో తీవ్రమైన చర్చ. గెలవడం గురుంచి కాదు.. గాయపరచడం గురుంచి. ఆటగాళ్లు చెలరేగకుండా ఉండాలంటే అదొక్కటే లక్ష్యమని.. దానికే పూనుకున్నారు. దీనికి నాయకుడు.. షోయబ్ అక్తర్.
అనుకున్నట్లుగానే.. మెల్ బోర్న్ వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్సులో 341 ఆలౌట్. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటర్ల వంతు. బాల్ అందుకున్న అక్తర్.. తన మూర్ఖత్వపు ఆలోచనను బయటపెట్టాడు. అందరి చూపు వికెట్లు వైపు ఉంటే.. తన చూపు మాత్రం బ్యాట్స్‌మెన్ తలపైనే ఉండేది. అలా ఆస్ట్రేలియా బ్యాటర్ జస్టిన్ లాంగర్ ను ఎంచుకున్నారు. బాల్ వేసినప్పుడల్లా.. అతని వైపు గుడ్లు ఉరిమి చూసేవాడు. బౌన్సర్లు తప్పించుకోవడానికి లాంగర్ నానా తిప్పలు పడుతుంటే, కోతిలా ఎగురుతున్నారంటూ అవహేళన చేశాడు. ఒకానొక సమయంలో అతన్ని గాయపరిచాడు కూడా.
“నేను ఎప్పుడూ బ్యాటర్ల తల పగలకొట్టాలనే ఉద్దేశంతోనే బౌన్సర్లు వేసేవాడిని. నా బౌలింగ్‌లో అలాంటి పేస్ ఉండేది. ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నప్పుడు ఈ కసి చాలా అవసరం. బౌలింగ్ చేసేటప్పుడు నా గుండె వేగం 185 దాటేసేది. గాలి వేగానికి నా జట్టు ఎగురుతూ ఉండేది. అప్పుడే ఫుల్లర్ కాకుండా బాడీకి తగిలేలా బంతులు వేయగలం. నేను వేసిన బాల్ తగిలితే వాపు రావాల్సిందే. అద్దంలో చూసుకున్న ప్రతీసారి నేను గుర్తుకు రావాలి. అదే నిజమైన ప్రేమ..” అంటూ కామెంట్లు చేసేవాడు అక్తర్.
పాకిస్తాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, వన్డేల్లో 247, టెస్టుల్లో 178, టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. గాయాలతో సతమతమవుతూ సుదీర్ఘ కెరీర్ కొనసాగించలేకపోయిన షోయబ్ అక్తర్, రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యాఖ్యతగానూ వ్యవహరించాడు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తూ సంచలన వ్యాఖ్యలతో వ్యూస్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వివాదాల అక్తర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sourav Ganguly: ఇండియన్ క్రికెట్‌కు గంగూలీ ఏం చేశాడు? అందరూ అతన్ని దాదా అని ఎందుకంటారు?