పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అక్తర్ తల్లి అనారోగ్యంతో ఆదివారం మరణించారు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్లో తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షోయబ్ తల్లి ఆరోగ్యం క్షీణిచడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందూతూ మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి.
Minister of State for Parliamentary Affaris @Ali_MuhammadPTI visited the house of @shoaib100mph to pay his respects on the loss of Shoaib Akhtar’s mother.
May Allah SWT grant the dearly departed the highest honours in Jannah. pic.twitter.com/lSq3cKz1Uf
— PTV News (@PTVNewsOfficial) December 26, 2021
కాగా అక్తర్ తల్లి మృతికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్‌తో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు. “ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని హర్భజన్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నాడు.