శిఖర్ ధావన్ గత కొంత కాలంగా టీమిండియాలో చోటు కోల్పోయి.. భార్య వల్ల కెరీర్ నాశనం అయ్యే స్టేజ్ కి వచ్చాడు. భార్య ఆయేషాతో విడాకుల తర్వాత.. దినేష్ కార్తిక్ లాగే ధావన్ కూడా మోసపోయాడా అని అనుకుంటున్నారు అభిమానులు. దాంతో భార్య వల్ల ధావన్ కెరీర్ ముగిసిపోబోతోందా? అన్న ప్రశ్న తాజాగా వినిపిస్తోంది.
శిఖర్ ధావన్.. టీమిండియా స్టార్ ఓపెనర్ గా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత మళ్లీ అంతటి స్థాయి ఆటగాడిగా జట్టులో పేరును సంపాదించుకున్నాడు. కంటిన్యూస్ గా పరుగులు చేస్తూ.. టీమ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పడు ధావన్ అంటే జట్టులో చోటు కోసం పోరాడుతున్న ఓ ప్లేయర్ మాత్రమే. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా.. టీమిండియాలో ధావన్ చోటు కోల్పోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శిఖర్ ధావన్.. టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సుస్థిరమైన బ్యాటింగ్ ఫామ్ తో జట్టులో కీలక ప్లేయర్ గా పేరొందాడు. అయితే గత కొన్ని నెలలుగా జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. ఓ వైపు ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతుండటమే కాక.. భార్యతో విడిపోడం మరో సమస్య. ఇక ధావన్-ఆయేషా ముఖర్జీ తమ తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి కొన్ని రోజుల క్రితం ముగింపు పలికిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆయేషా తన ఇమేజ్ ను, కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరిస్తున్నట్లు ధావన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. తనకు సంబంధించిన రహస్య వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నాడు.
దాంతో ధావన్ పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం..ధావన్ పరువుకు నష్టం కలిగించే చర్యలు, ఆరోపణలు చేయరాదు అంటూ ఆయేషాకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు. ఇక ఇప్పటికే తన వీడియోలను, ఫోటోలను చాలా మందికి షేర్ చేసిందని ధావన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ధావన్ ఫామ్ కోల్పోవడానికి, జట్టులో స్థానం కోల్పోవడానికి వ్యక్తిగత కారణలతో పాటుగా.. టీమిండియాలోకి గత కొంత కాలంగా వస్తున్న యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించడం అని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఓ వైపు ఇంటి వ్యవహారంతో మానసికంగా కుంగిపోవడం, ప్రస్తుతం టీమిండియాలోకి వచ్చిన యంగ్ ప్లేయర్స్ సత్తా చాటుతుండటంతో.. ధావన్ కు జట్టులో చోటు కష్టం అవుతోంది.
ఈ క్రమంలోనే ఆయేషా వల్లే ధావన్ క్రికెట్ కెరీర్ నాశనం అవుతోంది అని ధావన్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ దినేష్ కార్తిక్ భార్య కారణంగా జట్టులో చోటు కోల్పోయి.. మానసికంగా కుంగిపోయాడు. అయితే తన భార్య చేసిన గాయాన్ని మరచిపోయి, కఠోర సాధన చేసి జట్టులోకి బౌన్స్ బ్యాక్ అయ్యాడు DK. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. మరి దినేష్ కార్తిక్ లాగా శిఖర్ ధావన్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి గత వైభవాన్ని కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి. డీకే లా శిఖర్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.