ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెన్నిస్ స్టార్ అమెరికన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు ప్రకటించారు. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరెనా ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయం వెల్లడించారు. టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తనకు జీవితంలో ముఖ్యమైన విషయాలు, చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయని తెలిపారు.
ఒక ఏడాది పాటు టెన్నిస్ పోటీలకు దూరమైన సెరెనా ఇటీవలే గాయం నుంచి కోలుకుని గత జూన్‌లో జరిగిన వింబుల్డన్ పోటీల్లో పాల్గొన్నారు. కానీ సింగిల్స్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. ‘నేను ఈసారి వింబుల్డన్ టైటిల్ గెలుచుకోలేదు. న్యూయార్క్‌లో జరిగే యూఎస్ ఓపెన్లో కూడా నేను టైటిల్ గెలుస్తానో లేదో కూడా నాకు కచ్చితంగా తెలియదు. కానీ నేను ప్రయత్నిస్తాను.’ అని సెరెనా పేర్కొన్నారు. సెరెనా ఏకంగా 6 సార్లు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
కాగా యూఎస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధిస్తే.. దిగ్గజ ప్లేయర్ మార్గరెట్ (24 టైటిళ్లు) సరసన సెరెనా నిలుస్తారు. చివరిసారిగా 2017లో సెరెనా టైటిల్ గెలిచారు. ఇక తాను రిటైర్మెంట్ చెబుతున్నట్లు ప్రకటించడానికి ఇష్టపడనని.. దానికి బదులు ఎవల్యూషన్ అనే పదాన్ని వాడి తాను టెన్నిస్ నుంచి వైదొలుగుతానని సెరెనా వివరించారు. తన టైంను సెరెనా వెంచర్స్ డెవలప్ చేయడానికి అలాగే తన ఫ్యామిలీ కోసం కేటాయిస్తానని చెప్పారు. మరి ఈ దిగ్గజ టెన్నిస్ స్టార్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A must read. https://t.co/NSWDGHzsXK
— Serena Williams (@serenawilliams) August 9, 2022
ఇది కూడా చదవండి: జడేజా భార్య గొప్ప మనసును ప్రశంసించిన ప్రధాని మోదీ!