ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా టీమిండియా రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ తో బిజీగా ఉన్నారు. చాలా మందికి వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ టీ20 సిరీస్ జరుగుతున్న విషయం కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు రోవ్మన్ పావెల్ చేసిన పనికి అందరి దృష్టి ఇప్పుడు వెస్టిండీ- బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ వైపు మళ్లింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోవ్మన్ పావెల్ కొట్టిన భారీ సిక్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు వచ్చిన షకీబ్ అల్ హసన్ ఒక అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ వేశాడు. ఆ బంతిని రోవ్మన్ పావెల్ బ్యాక్ ఫుట్ వెళ్లి లాంగ్ ఆఫ్ గాల్లోకి లేపాడు. ఆ బంతి నేరుగా బౌండరీ ఆవల పడింది. ఇంకేముంది ఆ షాట్ చూసి ఒక్క షకీబ్ అహల్ హసనే కాదు.. మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు. ఇంక నెటిజన్లు అయితే ఆ బాల్ సిక్స్ ఎలా కొట్టావ్ మావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20లో ఎలాంటి ఫలితం రాలేదు. ఆదివారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోవ్మన్ పోవెల్ కొట్టిన భారీ సిక్సుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.