గ్రౌండ్ లో ఎప్పుడు సీరియస్ గా ఉండే రోహిత్ శర్మ రెండు రోజులుగా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన బామ్మర్ది పెళ్లిలో భార్యతో కలిసి స్నేక్ డ్యాన్స్ వేసి అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. అదే జోరును ఆసీస్ తో జరిగే వన్డే సిరీస్ లోనూ చూపించాలని భావిస్తోంది. ఇక ఆసీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం తొలి వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు టీమిండియా సారథి రోహిత్ శర్మ అందుబాటులో లేడు. తన బామ్మర్ది పెళ్లి 16, 17 రోజుల్లో జరుగుతుండటంతో ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు హిట్ మ్యాన్. ఇక ఈ పెళ్లి వేడుకల్లో జోరుగా హుషారుగా చిందులేస్తూ.. కనిపిస్తున్నాడు రోహిత్. ఇక బామ్మర్ది పెళ్లిలో తన భార్య రితికతో కలిసి కాలుకదిపాడు రోహిత్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
రోహిత్ శర్మ.. టీమిండియా హిట్ మ్యాన్ గా భారత్ కు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ తో బిజీగా ఉన్న రోహిత్ కాస్త విరామం తీసుకున్నాడు. తన భార్య రితికా సజ్దే సోదరుడు కునాల్ సజ్దే వివాహం కావడంతో.. ఆసీస్ తో జరిగే తొలి వన్డేకు అందుబాటులో లేడు. దాంతో ఈ మ్యాచ్ కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక బామ్మర్ది పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న రోహిత్.. సరదా సరదాగా నవ్వుతూ.. జోరుగా హుషారుగా సందడి చేస్తున్నాడు. గ్రౌండ్ లో ఎప్పుడూ సిరీయస్ గా ఉండే రోహిత్ తన లో ఉన్న జోవియల్ యాంగిల్ ను కూడా అభిమానులకు చూపించాడు. ఈ పెళ్లిలో భార్య రితికతో కలిసి వేదికపై కాలు కదిపాడు. బాలీవుడ్ పాట ‘లాల్ ఘాగ్రా’ పాటకు స్నేక్ డ్యాన్స్ తో దుమ్ములేపాడు.
ఈ వీడియోలో రోహిత్ పాములా చేతులు కదుపుతూ.. రితికతో స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అభిమానులు తెగ ఇస్టపడుతూ.. కామెంట్స్ చేస్తున్నాడు. గ్రౌండ్ లో అంత సీరియస్ గా ఉంటావ్ రోహిత్ భాయ్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని కొందరు కామెంట్ చేయగా.. నీ స్నేక్ డ్యాన్స్ సూపర్ హిట్ మ్యాన్ అంటూ.. మరికొంత మంది అభిమానులు కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా 15 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు నష్టపోయి 91 పరుగులు చేసింది. క్రీజ్ లో మిచెల్ మార్ష్ (47), లబూషేన్ (7) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ట్రవిస్ హెడ్(5), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (22) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో షమీ, పాండ్యా చెరో వికెట్ తీశారు.
Rohit Sharma’s dance at his brother-in-law’s marriage. pic.twitter.com/TTqalgeQH2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2023